Telugu Global
National

దీపాలు వెలిగించమంటే టపాసులు పేల్చుతారా?

గంభీర్, హర్భజన్ సింగ్ ఆగ్రహం కరోనా వైరస్ తో లాక్ డౌన్ పోరాటంలో మనం సంపూర్ణవిజయం సాధించకముందే… ప్రజల్లో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించడం పట్ల భారత మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్, హర్భజన్ సింగ్, అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్ విచారం వ్యక్తం చేశారు. ప్రధాని పిలుపు మేరకు…ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 9 నిముషాల వరకూ జ్యోతులు వెలిగించమంటే…దేశంలోని పలు ప్రాంతాలలో చాలామంది వీధుల్లోకి వచ్చి బాణాసంచా పేల్చారని…ఇది దురదృష్టకరమని, మనం ఏం సాధించామని టపాసులు […]

దీపాలు వెలిగించమంటే టపాసులు పేల్చుతారా?
X
  • గంభీర్, హర్భజన్ సింగ్ ఆగ్రహం

కరోనా వైరస్ తో లాక్ డౌన్ పోరాటంలో మనం సంపూర్ణవిజయం సాధించకముందే… ప్రజల్లో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించడం పట్ల భారత మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్, హర్భజన్ సింగ్, అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్ విచారం వ్యక్తం చేశారు.

ప్రధాని పిలుపు మేరకు…ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 9 నిముషాల వరకూ జ్యోతులు వెలిగించమంటే…దేశంలోని పలు ప్రాంతాలలో చాలామంది వీధుల్లోకి వచ్చి బాణాసంచా పేల్చారని…ఇది దురదృష్టకరమని, మనం ఏం సాధించామని టపాసులు పేల్చామంటూ ట్విట్టర్ ద్వారా బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించాడు.

కరోనాతో పోరాటం కోసం ప్రధానమంత్రి సహాయనిధికి ఎంపీలాడ్స్ నిధుల నుంచి కోటిరూపాయలు, వ్యక్తిగతంగా 50 లక్షల రూపాయలు ఇచ్చిన గంభీర్.. ప్రజలు జాగురూకతతో వ్యవహరించాలని, అత్యుత్సాహం ప్రదర్శించరాదని కోరాడు.

పంజాబీ పుత్తర్ హర్భజన్ సింగ్ సైతం..బాణాసంచా కాల్చడాన్ని తప్పుపట్టాడు. కరోనాను దేశం నుంచి తరిమికొట్టక ముందే వీధుల్లోకి రావడం, విచ్చలవిడిగా ప్రవర్తించడంతో ఫలితం లేకుండా పోతుందని, లాక్ డౌన్ ప్రభావం బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశాడు.

మరోవైపు… మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, ప్రస్తుత టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం… ప్రజలను వీధుల్లోకి రావద్దంటూ వేడుకొన్నారు.

ఎవరికివారే తమతమ నివాసాలలో ఉంటూ దీపాలు వెలిగించమని ప్రధాని కోరితే..అందరూ వీధుల్లోకి వచ్చి టపాసులు పేల్చడంలో ఏమాత్రం అర్థం లేదని, కరోనా వైరస్ తో పోరాటంలో మనం సగంలోనే ఉన్నామని, ఎవరికి వారే బాధ్యతతో వ్యవహరించి ముందుగా తమను, తమ కుటుంబాన్ని కాపాడుకోగలిగితే.. ఇరుగుపొరుగు వారిని, సమాజాన్ని, దేశాన్ని, మానవాళిని కాపాడినవారవుతారంటూ అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్ విజ్ఞప్తి చేశారు.

First Published:  6 April 2020 9:25 PM GMT
Next Story