మరో బాలీవుడ్ కుటుంబానికి కరోనా

బాలీవుడ్ నుంచి ఇప్పటికే సింగర్ కనికా కపూర్ కు కరోనా సోకింది. వెంటనే ఆమెను హాస్పిటల్కి చేర్చి, ఆమె కుటుంబం మొత్తాన్ని క్వారంటైన్ లో ఉంచారు. దాదాపు 2 వారాల పాటు చికిత్స పొందిన తర్వాత కనికా కోలుకుంది. తాజాగా డిశ్చార్జ్ అయింది కూడా. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్న టైమ్ లో, బాలీవుడ్ లో మరో పాజిటివ్ కేసు బయటపడింది. ఈసారి నిర్మాత కరీమ్ మోరానీ కుటుంబం కరోనాకు బుక్కయింది.

షారూక్ ఖాన్ తో చెన్నై ఎక్స్ ప్రెస్, రావన్, హ్యాపీ న్యూ ఇయర్, దిల్ వాలే లాంటి సినిమాల్ని నిర్మించాడు కరీమ్ మొరానీ. ఈమె రెండో కూతురు, నటి జోయో మొరానీకి కరోనా పాజిటివ్ వచ్చింది. అంతే కాదు, ఆమె అక్క షాజా మొరానీకి కూడా కరోనా సోకినట్టు నిన్న నిర్థారణ అయింది. వెంటనే జోయాను కోకిలాబెన్ లో, ఆమె అక్కను నానావతి హాస్పిటల్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు కరీమ్ దంపతులకు కూడా టెస్టులు నిర్వహించారు. వాళ్ల రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతానికి వాళ్లను హోమ్ క్వారంటైన్ లో ఉంచారు. షారూక్-కరీమ్ మంచి స్నేహితులు. కరీమ్ కూతురు జోయో ఆల్వేజ్ కభీ కభీ, భాగ్ జానీ లాంటి సినిమాల్లో నటించింది.