Telugu Global
Cinema & Entertainment

ఆ రెండు సినిమాలు కూడా వచ్చేశాయి...

కరోనా రాకతో టీవీ వీక్షణ, స్ట్రీమింగ్ రెండూ పెరిగాయి. లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉన్న ప్రజలంతా టీవీ లేదా డిజిటల్ స్ట్రీమింగ్ వైపు మొగ్గుచూపుతున్నారు. టీవీలో కొత్త కంటెంట్ లేదు. షూటింగ్స్ నిలిచిపోవడంతో సీరియల్స్, రియాలిటీ షోలు లేవు. వేసిన సినిమాల్నే మళ్లీ మళ్లీ వేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైమ్ లోనే డిజిటల్ స్ట్రీమింగ్ తెరపైకి వచ్చింది. మరీ ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. లాక్ డౌన్ ను దృష్టిలో […]

ఆ రెండు సినిమాలు కూడా వచ్చేశాయి...
X

కరోనా రాకతో టీవీ వీక్షణ, స్ట్రీమింగ్ రెండూ పెరిగాయి. లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉన్న ప్రజలంతా టీవీ లేదా డిజిటల్ స్ట్రీమింగ్ వైపు మొగ్గుచూపుతున్నారు. టీవీలో కొత్త కంటెంట్ లేదు. షూటింగ్స్ నిలిచిపోవడంతో సీరియల్స్, రియాలిటీ షోలు లేవు. వేసిన సినిమాల్నే మళ్లీ మళ్లీ వేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైమ్ లోనే డిజిటల్ స్ట్రీమింగ్ తెరపైకి వచ్చింది. మరీ ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది.

లాక్ డౌన్ ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పలు కొత్త సినిమాల్ని డిజిటల్ స్ట్రీమింగ్ లో పెట్టిన అమెజాన్ ప్రైమ్.. తాజాగా మరో రెండు సినిమాల్ని కూడా లైన్లో పెట్టింది. లాక్ డౌన్ కు కొన్ని రోజుల ముందు రిలీజైన పలాస అనే సినిమాను ఆల్రెడీ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చిన అమెజాన్ ప్రైమ్.. ఇండస్ట్రీలో చిట్టచివరిగా విడుదలైన మథ అనే సినిమాను కూడా మరో 2 రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తోంది.

ఈ 2 సినిమాలతో అమెజాన్ ప్రైమ్ లో దాదాపు రీసెంట్ గా రిలీజైన సినిమాలన్నీ వచ్చేసినట్టయింది. ఓ పిట్టకథ, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, హిట్, పలాస.. ఇలా రీసెంట్ గా రిలీజైన సినిమాలన్నీ ఇప్పుడు ప్రైమ్ లోకి వచ్చేశాయి.

First Published:  6 April 2020 10:03 PM GMT
Next Story