అన్నీ బంద్ చేసిన అక్కినేని హీరో

లాక్ డౌన్ టైమ్ లో అంతా సేఫ్ గా ఇళ్లలోనే ఉండండి. ఎలాంటి సెలబ్రేషన్స్ వద్దు. ఈ టైమ్ లో పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి హీరో ఇలానే స్టేట్ మెంట్ ఇస్తున్నాడు.

అయితే ఓవైపు ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చినా మరోవైపు తన సినిమా నుంచి టైటిల్ లేదా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తూనే ఉన్నారు. దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు హీరో అఖిల్. ఈరోజు తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ హీరో.. తన నుంచి ఎలాంటి ఫస్ట్ లుక్ ఉండదని స్పష్టంచేశాడు.

బర్త్ డే సందర్భంగా తన మూవీ ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూసే బదులు ఇంట్లో కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడపాలని, కాలు బయట పెట్టొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాడు అఖిల్. ఈ సందర్భంగా ఓ చిన్న టాస్క్ కూడా ఇచ్చాడు. ఈ పుట్టినరోజుకు తన కుటుంబంతో హ్యాపీగా గడుపుతున్న ఫొటోను తను పోస్ట్ చేస్తానని, అంతా తనలానే తమ కుటుంబంతో హ్యాపీగా గడుపుతున్న ఫొటోను తనకు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయాలని కోరాడు.

ఈ పనితో అఖిల్ అందరి మనసులు గెలుచుకున్నాడు. నిజానికి బర్త్ డే సందర్భంగా అఖిల్ తన కొత్త సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుంచి ఏదైనా స్టిల్ రిలీజ్ చేయొచ్చు. దాని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అక్కినేని ఫ్యాన్స్ ఎవ్వరూ బయటకు రారు. కానీ ఆ చిన్న అవకాశం కూడా ఇవ్వడానికి ఒప్పుకోలేదు అఖిల్. యూనిట్ తో మాట్లాడి మరీ ఎలాంటి ఫస్ట్ లుక్ పోస్టర్లు, బర్త్ డే పోస్టర్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ సిసింద్రీ.