బన్నీ బర్త్ డే గిఫ్ట్ పుష్ప

అల వైకుంఠపురములో తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు బన్నీ. సుకుమార్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లాలని రెడీ అయ్యే టైమ్ కు కరోనా వచ్చింది. దీంతో మొత్తానికే సినిమా ఆగిపోయింది. అయితే ఈ గ్యాప్ లోనే తన కొత్త సినిమా సందడి స్టార్ట్ చేశాడు బన్నీ. పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేశాడు.

బన్నీ-సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు పుష్ప అనే టైటిల్ పెట్టారు. ఇదేదో ఫిమేల్ టైటిల్ అనుకోవద్దు. ఈ సినిమాలో బన్నీ క్యారెక్టర్ పేరు పుష్పరాజ్. అంతా ముద్దుగా పుష్ప అని పిలుస్తారన్నమాట. అదే సినిమా టైటిల్ గా మారింది.

ఇక ఫస్ట్ లుక్ విషయానికొస్తే, పక్కా మాస్ లుక్ లో బన్నీ సరిగ్గా సెట్ అయ్యాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు బన్నీ అలియాస్ పుష్ప. రష్మిక హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా సినిమాను రిలీజ్ చేయాలనేది ప్లాన్.