Telugu Global
International

విరాట్ కొహ్లీ ఆధిపత్యానికి బెన్ బ్రేక్

2020 విజ్ డెన్ క్రికెటర్ గా బెన్ స్టోక్స్ విజ్ డెన్ ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్ గా…గత మూడు సంవత్సరాలుగా అవార్డులు గెలుచుకొంటూ వచ్చిన భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ ఆధిపత్యానికి… ఇంగ్లండ్ సూపర్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ గండి కొట్టాడు. 2020 విజ్ డెన్ అల్మానాక్ తాజా పురస్కారాల ప్రకారం…బెన్ స్టోక్స్ ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్ గా నిలిచాడు. 2005లో యాండ్రూ ఫ్లింటాఫ్ విజ్ డౌన్ పురస్కారం అందుకొన్న తర్వాత…మరో ఇంగ్లీష్ క్రికెటర్ గా బెన్ స్టోక్స్ […]

విరాట్ కొహ్లీ ఆధిపత్యానికి బెన్ బ్రేక్
X
  • 2020 విజ్ డెన్ క్రికెటర్ గా బెన్ స్టోక్స్

విజ్ డెన్ ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్ గా…గత మూడు సంవత్సరాలుగా అవార్డులు గెలుచుకొంటూ వచ్చిన భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ ఆధిపత్యానికి… ఇంగ్లండ్ సూపర్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ గండి కొట్టాడు.

2020 విజ్ డెన్ అల్మానాక్ తాజా పురస్కారాల ప్రకారం…బెన్ స్టోక్స్ ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్ గా నిలిచాడు. 2005లో యాండ్రూ ఫ్లింటాఫ్ విజ్ డౌన్ పురస్కారం అందుకొన్న తర్వాత…మరో ఇంగ్లీష్ క్రికెటర్ గా బెన్ స్టోక్స్ ఈ ఘనత సాధించగలిగాడు.

ఆస్ట్ర్రేలియాతో ముగిసిన యాషెస్ సిరీస్ ఆఖరి మ్యాచ్ లో బెన్ స్టోక్స్ 135 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

అంతేకాదు…న్యూజిలాండ్ తో ముగిసిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సైతం బెన్ స్టోక్స్ ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్స్ అవార్డు సాధించాడు.

గత సీజన్లో బెన్ స్టోక్స్ క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ అసాధారణంగా రాణించాడని, ఇంగ్లండ్ కు ఒంటిచేత్తో విజయాలు అందించాడని విజ్ డెన్ ఎడిటర్ లారెన్స్ బూత్ ప్రకటించారు.

ఈ పురస్కారానికి బెన్ స్టోక్స్ ను మించిన మరో క్రికెటర్ తమకు కనిపించలేదని వివరించారు. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైన బెన్ స్టోక్స్… ఐపీఎల్ 13వ సీజన్లో అత్యుత్తమ వేలం ధర దక్కించుకొన్న విదేశీ క్రికెటర్ గా నిలిచాడు.

విజ్ డెన్ ఐదుగురు అత్యుత్తమ క్రికెటర్లలో నిలిచిన ఇతర స్టార్ ప్లేయర్లలో పాట్ కమిన్స్, మార్నుస్ లాబ్ చేజ్, ఎల్సీ పెర్రి, జోఫ్రా ఆర్చర్, ఆఫ్ స్పిన్నర్ సిమోన్ హార్మర్ ఉన్నారు.

మహిళల అత్యుత్తమ క్రికెటర్ పురస్కారం కోసం భారత ఓపెనర్ స్మృతి మంథానాతో పోటీపడిన… ఎల్సీ పెర్రీ.. విజ్ డెన్ బెస్ట్ మహిళా క్రికెటర్ గా నిలువగలిగింది.

First Published:  8 April 2020 9:07 AM GMT
Next Story