చిన్నప్పుడే మెగాస్టార్ కు లాటరీ…. ఏం వచ్చిందో తెలుసా?

ఉగాది రోజున మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. నాటి నుంచి మెగాస్టార్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో తన అనుభవాలను పంచుకుంటూ వారిలో ఉత్సాహాన్ని నింపుతున్న సంగతి తెల్సిందే. ఇటీవల అభిమానులకు ఏప్రిల్ 8తో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధం ఉందని.. సశేషం అంటూ అభిమానులకు వదిలేశారు. దీంతో ఏప్రిల్ 8తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని తెలుసుకునే పనిలో అభిమానులు పడ్డారు. కొందరు అభిమానులు నాలుగైదు కారణాలను ట్వీట్ చేశారు. తాజాగా చిరంజీవి తనకు ఏప్రిల్ 8తో ఉన్న అనుబంధాన్ని రివీల్ చేశారు.

నేడు(ఏప్రిల్ 8) హనుమాన్ జయంతి. స్వతహాగా మెగాస్టార్ హనుమాన్ భక్తుడు. ఆంజనేయస్వామికి చిరంజీవికి వీడదీయరాని సంబంధం ఉందని ఆయన ట్వీటర్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తన జీవితంలో జరిగిన ఓ మధురమైన సంఘటనను ఆయన ట్వీటర్లో అభిమానులతో పంచుకున్నారు. 1962లో తనకు ఓ లాటరిలో హునుమంతుడి బొమ్మ వచ్చిందని తెలిపారు. నాటి నుంచి నేటివరకు ఆ బొమ్మ తన దగ్గరే భద్రంగా ఉందని చెప్పారు. ఇది తన దగ్గర ఉందని చెప్పడం కంటే భద్రంగా దాచుకున్నాను అని చెప్పడం కరెక్ట్ అని మెగాస్టార్ ట్వీట్ చేశారు.

అలాగే తన చేతిలో ఉన్న ఆ బొమ్మ చూసిన తన తండ్రి ‘ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం తనలాగే ఉన్నాయని’ చిరంజీవి ట్వీటర్లో పేర్కొన్నారు. అలాగే ఈరోజుకు మరో ప్రత్యేకత ఉందన్నారు. 2002లో బాపుగారు తన ఇంట్లో పెట్టుకునేందుకు తనకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రీకరించి పంపించారని తెలిపారు. ఇక దానిని పాలరాతి మీద రీప్రొడ్యూస్ చేయించి పూజ గదిలో పెట్టుకున్నట్లు చిరంజీవి తెలిపారు.

చిన్నతనంలో లాటరీలో వచ్చిన హనుమాన్ బొమ్మను ఇప్పటికీ మెగాస్టార్ తన దగ్గర దాచిపెట్టుకోవడం నిజంగా గొప్ప విషయమేనని అభిమానులు అంటున్నారు. ఈ మధురానుభూతిని తమతో పంచుకున్నందుకు మెగాస్టార్ కు అభిమానులు థ్యాంక్స్ చెబుతున్నారు. ఇది నిజంగా గొప్పవిషయమని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.