త్రిషపై చిరు రియాక్షన్

ఆచార్య సినిమాలో ముందుగా అనుకున్న హీరోయిన్ త్రిష. కానీ సరిగ్గా తన షెడ్యూల్ స్టార్ట్ అయ్యే టైమ్ కు త్రిష హ్యాండ్ ఇచ్చింది. క్రియేటివ్ డిఫరెన్సెన్స్ కారణంగా ఆచార్య నుంచి తప్పుకుంటున్నానని, మరో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరిస్తానని అప్పట్లో ట్వీట్ చేసింది. ఎట్టకేలకు ఈ అంశంపై మెగాస్టార్ స్పందించారు. త్రిష తన సినిమా నుంచి వెళ్లిపోవడం వెనక ఎలాంటి వివాదం లేదని క్లారిటీ ఇచ్చారు.

“నేను అందరితో మాట్లాడాను ఎవరికి ఆమెతో విభేదాలు లేవు. అయినప్పటికీ తను సినిమా నుండి తప్పుకుంది. ఎందుకంటే… మణిరత్నం సినిమాలో ఆమెకు అవకాశం వచ్చింది. అందుకే ఆచార్య నుండి త్రిష తప్పుకుంది.”

ఇలా స్వయంగా చిరంజీవి క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. త్రిషపై మొన్నటివరకు నడిచిన ట్రోలింగ్ కు చిరు ఇలా ఎండ్ కార్డ్ వేశారన్నమాట. త్రిష తప్పుకోవడంతో ఆ స్థానాన్ని కాజల్ తో భర్తీ చేశారు. కరోనా క్రైసిస్ తగ్గిన వెంటనే కాజల్-చిరంజీవితో ఆచార్య ఫ్రెష్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.