ప్రభాస్, తారక్, చరణ్ లకు అల్లు అర్జున్ చాలెంజ్

ప్రస్తుతం ఏ తెలుగు హీరో కూడా కేవలం తెలుగు మార్కెట్ కే పరిమితం కావాలని అస్సలు అనుకోవడం లేదు. పాన్ ఇండియా మార్కెట్ ను అందుకోవాలని.. ఇతర రాష్ట్రాల ల సినీ మార్కెట్ పై కూడా దృష్టి సారిస్తున్నారు. బాహుబలితో వచ్చిన స్టార్ డం స్ఫూర్తితో ఇప్పుడు ప్రభాస్ దేశవ్యాప్తంగా పాన్ ఇండియా మార్కెట్ ను అందిపుచ్చుకున్నాడు. సాహో తీసి హిందీలోనూ విడుదల చేశాడు. రిజల్ట్స్ తో సంబంధం లేకుండా ఈ పని చేశాడు.

ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎన్టీఆర్, రాంచరణ్ సైతం ప్యాన్ ఇండియా స్టార్లుగా మారడం ఖాయం.. ప్రభాస్ లాగానే వీరిని కూడా ఆర్ఆర్ఆర్ ఆల్ ఇండియా స్టార్స్ చేస్తాదనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే వీరెవరికి ప్యాన్ ఇండియా మోజు లేకున్నా రాజమౌళి వల్ల ఓవర్ నైట్ అయిపోతున్నారు. కానీ అల్లు అర్జున్ కు మాత్రం తాను ప్యాన్ ఇండియా స్టార్ కావాలన్న కోరిక ఉంది. ఇప్పటికే మలయాళంలో భారీ మార్కెట్ సంపాదించుకున్న అల్లు అర్జున్ తమిళంతోపాటు హిందీలోకి వెళ్లాలన్న కోరికను వ్యక్తం చేశాడు కూడా.

తాజాగా సుకుమార్ తో చిత్రం ప్రకటించారు. బన్నీ బర్త్ డే సందర్భంగా వివిధ భాషలలో ముద్రించిన టైటిల్ లోగోలతో ‘పుష్పా’ సినిమా పోస్టర్లు హాట్ టాపిక్ గా మారాయి.

ప్రస్తుతం బన్నీ కేరళతోపాటు కర్ణాటక రాష్ట్రాల్లోనూ మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇక బన్నీ హిందీ డబ్బింగ్ సినిమాలకు యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సంపాదించాయి. అందుకే తాజాగా హిందీలోనూ ఈ సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నాడట.

అయితే విభిన్నమైన దర్శకుడైన సుకుమార్ చిత్రాలు అయితే హిట్ అవుతాయి.. లేదంటే తేడా కొడతాయి.. బన్నీ ఆశలు ఈ పుష్ప సినిమాతో నెరవేరుతాయో లేదో చూడాలి.