Telugu Global
International

వింబులన్డ్ కు భారీగా బీమా పరిహారం

141 మిలియన్ డాలర్లు అందుకోనున్న నిర్వాహక సంఘం కరోనా వైరస్ దెబ్బతో…ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ తో సహా క్రీడాసంఘాలన్నీ దుకాణాలు మూసుకొని జరిగిన నష్టాన్ని అంచనావేసుకొంటూ ఓవైపు గుండెలు బాదుకొంటుంటే… మరోవైపు వింబుల్డన్ నిర్వాహక ఆల్ ఇంగ్లండ్ టెన్నిస్ క్లబ్ మాత్రం… టోర్నీని రద్దు చేసినా రికార్డుస్థాయిలో పరిహారం అందుకోనుంది. రెండోప్రపంచ యుద్ధం తర్వాత…. గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలోనే అత్యంత పురాతన టోర్నీవింబుల్డన్ గత 110 సంవత్సరాలుగా నిత్యనూతనంగానే ఉంటూ తన ప్రత్యేకతను కాపాడుకొంటూ వస్తోంది. విశ్వవిఖ్యాత టెన్నిస్ […]

వింబులన్డ్ కు భారీగా బీమా పరిహారం
X
  • 141 మిలియన్ డాలర్లు అందుకోనున్న నిర్వాహక సంఘం

కరోనా వైరస్ దెబ్బతో…ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ తో సహా క్రీడాసంఘాలన్నీ దుకాణాలు మూసుకొని జరిగిన నష్టాన్ని అంచనావేసుకొంటూ ఓవైపు గుండెలు బాదుకొంటుంటే… మరోవైపు వింబుల్డన్ నిర్వాహక ఆల్ ఇంగ్లండ్ టెన్నిస్ క్లబ్ మాత్రం… టోర్నీని రద్దు చేసినా రికార్డుస్థాయిలో పరిహారం అందుకోనుంది.

రెండోప్రపంచ యుద్ధం తర్వాత….

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలోనే అత్యంత పురాతన టోర్నీవింబుల్డన్ గత 110 సంవత్సరాలుగా నిత్యనూతనంగానే ఉంటూ తన ప్రత్యేకతను కాపాడుకొంటూ వస్తోంది. విశ్వవిఖ్యాత టెన్నిస్ స్టార్లందరూ వింబుల్డన్ కు ఇచ్చిన ప్రాధాన్యం మరే టోర్నీకి ఇవ్వడంలేదు. వింబుల్డన్ లో పాల్గొనడమే ఓ అదృష్టంగా పరిగణిస్తూ వస్తున్నారు.

అయితే…1940 దశకంలో రెండో ప్రపంచ యుద్ధం కారణంగా వింబుల్డన్ ను రద్దు చేశారు. ఆ తర్వాత…కరోనా వైరస్ దెబ్బతో 2020 వింబుల్డన్ టోర్నీని సైతం రద్దు చేయక తప్పలేదు.

గత 17 సంవత్సరాలుగా భారీ బీమా…

వింబుల్డన్ నిర్వాహక సంఘం గత 17 సంవత్సరాలుగా ఏడాదికి 20 లక్షల డాలర్ల చొప్పున ఓ విఖ్యాత ఇన్సూరెన్స్ కంపెనీకి క్రమం తప్పకుండా బీమా మొత్తం చెల్లిస్తూ వస్తోంది.

ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, కరోనా వైరస్ లాంటి మహమ్మారిలతో పోటీలు రద్దయితే…కవరేజ్ కింద బీమా మొత్తాన్ని ని్ర్వాహక సంఘం చెల్లిస్తూ వచ్చింది.

గత 16 సంవత్సరాలుగా అప్పనంగా బీమా కంపెనీ 20 మిలియన్ డాలర్ల మొత్తాన్ని తన ఖాతాలో జమ చేసుకొంటూ వస్తోంది. అయితే…గత ఆరు దశాబ్దాల కాలంలో తొలిసారిగా వింబుల్డన్ పోటీలు…అదీ కరోనా వైరస్ దెబ్బతో రద్దుల పద్దులో చేరిపోడంతో…ఇన్సూరెన్స్ కంపెనీ నెత్తిన పిడుగుపడినట్లయ్యింది.

వింబుల్డన్ నిర్వాహక సంఘానికి మొత్తం 141 మిలియన్ డాలర్లు నష్టపరిహారంగా చెల్లించనున్నట్లు ఇన్యూరెన్స్ కంపెనీ ప్రతినిధి ప్రకటించారు.

గత 17 సంవత్సరాలుగా 34 మిలియన్ డాలర్లు అందుకొన్న బీమా సంస్థ… దానికి నాలుగురెట్లు ఎక్కువ మొత్తాన్ని నష్టపరిహారంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టోర్నీ రద్దుతో 324 మిలియన్ డాలర్ల నష్టం…

2020 జూన్ 29 నుంచి రెండువారాలపాటు జరగాల్సిన వింబుల్డన్ టోర్నీ రద్దు కారణంగా నిర్వాహక సంఘానికి 324 మిలియన్ డాలర్ల మేర నష్టం కలుగనుంది.

అయితే…టోర్నీ ప్రారంభానికి ముందే పోటీలను రద్దు చేయడంతో రెండువారాల నిర్వహణ వ్యయం భారం లేకుండా పోయింది.
మొత్తం 324 డాలర్ల మేర నష్టం జరిగితే 141 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని బీమా సంస్థ నుంచి అందుకోనుంది.

మిగిలిన క్రీడాసంఘాలన్నీ భారీగా నష్టపోయి లబోదిబో అంటుంటే …వింబుల్డన్ నిర్వాహక సంఘం మాత్రం…కరోనా వైరస్ పుణ్యమా అంటూ 141 మిలియన్ డాలర్ల పరిహారం పొందటం హాశ్చర్యమే మరి.

First Published:  9 April 2020 7:00 AM GMT
Next Story