Telugu Global
Cinema & Entertainment

పవన్-శృతిహాసన్ కాంబో లేనట్టే!

ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమా వకీల్ సాబ్. పవర్ స్టార్ కు ఇది రీఎంట్రీ మూవీ. దీంతో ఫ్యాన్స్ అంతా ఈ మూవీ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తయినప్పటికీ హీరోయిన్ మాత్రం ఇంకా సెలక్ట్ కాలేదు. తాజాగా శృతిహాసన్ ను సెలక్ట్ చేసినట్టు టాక్ వచ్చినప్పటికీ అది కూడా రూమర్ అని తేలిపోయింది. స్వయంగా శృతిహాసన్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. “ఎన్నో విషయాలు అలా వచ్చి ఇలా తేలిపోతుంటాయి. ఇది […]

పవన్-శృతిహాసన్ కాంబో లేనట్టే!
X

ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమా వకీల్ సాబ్. పవర్ స్టార్ కు ఇది రీఎంట్రీ మూవీ. దీంతో ఫ్యాన్స్ అంతా ఈ మూవీ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తయినప్పటికీ హీరోయిన్ మాత్రం ఇంకా సెలక్ట్ కాలేదు. తాజాగా శృతిహాసన్ ను సెలక్ట్ చేసినట్టు టాక్ వచ్చినప్పటికీ అది కూడా రూమర్ అని తేలిపోయింది. స్వయంగా శృతిహాసన్ దీనిపై క్లారిటీ ఇచ్చింది.

“ఎన్నో విషయాలు అలా వచ్చి ఇలా తేలిపోతుంటాయి. ఇది కూడా అలాంటిదే. వకీల్ సాబ్ లో నేనున్నాను అనేది నిజం కాదు. ఇదొక రూమర్. కాబట్టి ఈ ప్రాజెక్టు గురించి అంతకంటే నేను ఎక్కువ మాట్లాడను.”

ఇలా వకీల్ సాబ్ లో తను లేననే విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పేసింది శృతిహాసన్. ప్రస్తుతం రవితేజ సరసన క్రాక్ అనే సినిమా చేస్తోన్న ఈ బ్యూటీని, వకీల్ సాబ్ ప్రాజెక్టులోకి తీసుకున్నట్టు మొన్నటివరకు అంతా అనుకున్నారు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ కూడా సంబరపడ్డారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ ను రూమర్ గా కొట్టిపారేసింది శృతిహాసన్.

First Published:  9 April 2020 9:49 PM GMT
Next Story