Telugu Global
National

క్రికెటర్లకు బకాయిలు చెల్లించిన బీసీసీఐ

ఇంగ్లండ్ లో క్రికెటర్ల వేతనాలలో కోత కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ప్రపంచ దేశాలే ఆర్థికంగా అతలాకుతలమైపోతున్నాయి. స్వదేశీ,విదేశీ వ్యాపారాలు స్తంభించిపోడంతో ప్రపంచ ఆర్ధికవ్యవస్థ పరిస్థితి సైతం ఆందోళనకరంగా మారింది. జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్…కరోనాను ఎదుర్కొనడానికి వీలుగా గత మూడువారాలుగా లాక్ డౌన్ ను పాటిస్తోంది. దీంతో దేశ ఆర్థిక కార్యకలాపాలన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. అంతేకాదు…దేశంలోని 80 కోటమంది ప్రజల ఆహారభద్రత కోసం కోటీ 70 లక్షల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తోంది. […]

క్రికెటర్లకు బకాయిలు చెల్లించిన బీసీసీఐ
X
  • ఇంగ్లండ్ లో క్రికెటర్ల వేతనాలలో కోత

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ప్రపంచ దేశాలే ఆర్థికంగా అతలాకుతలమైపోతున్నాయి. స్వదేశీ,విదేశీ వ్యాపారాలు స్తంభించిపోడంతో ప్రపంచ ఆర్ధికవ్యవస్థ పరిస్థితి సైతం ఆందోళనకరంగా మారింది.

జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్…కరోనాను ఎదుర్కొనడానికి వీలుగా గత మూడువారాలుగా లాక్ డౌన్ ను పాటిస్తోంది.

దీంతో దేశ ఆర్థిక కార్యకలాపాలన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. అంతేకాదు…దేశంలోని 80 కోటమంది ప్రజల ఆహారభద్రత కోసం కోటీ 70 లక్షల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తోంది.

మరోవైపు…ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు పరిస్థితి సైతం గందరగోళంగా మారింది. దేశవాళీ క్రికెట్ తో పాటు.. స్వదేశీ, విదేశీ సిరీస్ లు రద్దయ్యాయి. దానికితోడు మార్చి 29న ప్రారంభంకావాల్సిన వేలకోట్ల రూపాయల ఐపీఎల్ లీగ్ వ్యాపారం సైతం నిలిచిపోయింది.

దీంతో…గత రెండుమాసాలుగా పనీపాటలేకుండా ఇంటికే పరిమితమైన అంతర్జాతీయ, దేశవాళీ క్రికెటర్లు తమతమ స్థాయికి తగ్గట్టుగా భారీమొత్తంలోనే ఆదాయం కోల్పోయారు.

క్రికెటర్లకు ఆర్ధికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా…బీసీసీఐ నాలుగుమాసాలకు ఓ సారి చెల్లించే బకాయిలను సైతం వారివారి ఖాతాలకు బదిలీ చేసింది. బీసీసీఐ సైతం ఆర్థికంగా భారీగా నష్టపోయినా….క్రికెటర్ల కు ఇబ్బందులు తలెత్తకుండా బకాయిలు చెల్లించామని బోర్డు ప్రతినిధి ప్రకటించారు.

దేశవాళీ క్రికెటర్లకు మ్యాచ్ ఫీజుల బకాయిలు, అంతర్జాతీయ క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులతో పాటు వార్షిక కాంట్రాక్టులోని క్వార్టర్లీ మొత్తాన్ని సైతం చెల్లించింది.

భారత్ లో ఇలా…ఇంగ్లండ్ లో అలా…

మరోవైపు…ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు, క్రికెట్ ఆస్ట్ర్రేలియా, క్రికెట్ న్యూజిలాండ్ మాత్రం..క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోడంతో…దేశవాళీ కౌంటీ క్రికెటర్ల నుంచి కాంట్రాక్టు క్రికెటర్ల వరకూ..వేతనాలలో 20శాతం కోతపెట్టినట్లు ప్రకటించింది. ఆటలేకపోతే ఆదాయం రాదని, ఆదాయం రాకపోతే క్రికెటర్లకు వేతనాలు ఎక్కడనుంచి తెచ్చి చెల్లిస్తామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రశ్నిస్తోంది.

అయితే…భారత క్రికెట్ బోర్డు మాత్రం వార్షిక కాంట్రాక్టులు పొందిన కొహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా లాంటి మొత్తం 21 మంది క్రికెటర్లకు…గత మూడుమాసాలుగా క్రికెట్ మ్యాచ్ లు లేకపోయినా…పెద్దమనసుతో క్వార్టర్లీ మొత్తాన్ని చెల్లించడం విశేషం.

ఆర్థికంగా వనరులు ఉన్నకారణంగా బీసీసీఐ తట్టుకోగలిగిందని, భవిష్యత్ లో పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పలేమని, కరోనా వైరస్ ఉపశమించకుండా.. ఇదే పరిస్థితి కొనసాగితే…ఆర్థికపరిస్థితిని బేరీజు వేసి..అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకొంటామని బీసీసీఐ కోశాధికారి చెబుతున్నారు.

విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా లాంటి టాప్ గ్రేడ్ క్రికెటర్లకు…కాంట్రాక్టు క్వార్టర్లీ మొత్తం కింద కోటిన్నర రూపాయల చొప్పున బీసీసీఐ చెల్లించింది.

First Published:  10 April 2020 8:28 PM GMT
Next Story