Telugu Global
National

మరో 2 వారాలు లాక్‌డౌన్‌ పొడిగింపు ?

రాష్ట్రాల ఒత్తిడితో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకు పొడిగించే అవకాశం ఉంది. రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకునే చాన్స్‌ ఉంది. రాష్ట్రాల సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ తరువాత ప్రధాని మోదీ హైలెవల్‌ కమిటీతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌ తర్వాత లాక్‌డౌన్‌ పొడిగింపుపై వీడియో సందేశం విడుదల చేసే చాన్స్‌ ఉంది. కరోనాపై పోరుకు లాక్‌డౌన్‌ ఒక్కటే శరణ్యమని పలు రాష్ట్రాలు ప్రధాని మోదీకి సూచించాయి. ఏప్రిల్‌ 30 […]

మరో 2 వారాలు లాక్‌డౌన్‌ పొడిగింపు ?
X

రాష్ట్రాల ఒత్తిడితో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకు పొడిగించే అవకాశం ఉంది. రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకునే చాన్స్‌ ఉంది. రాష్ట్రాల సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ తరువాత ప్రధాని మోదీ హైలెవల్‌ కమిటీతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌ తర్వాత లాక్‌డౌన్‌ పొడిగింపుపై వీడియో సందేశం విడుదల చేసే చాన్స్‌ ఉంది.

కరోనాపై పోరుకు లాక్‌డౌన్‌ ఒక్కటే శరణ్యమని పలు రాష్ట్రాలు ప్రధాని మోదీకి సూచించాయి. ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగించాలని, లేకుంటే కరోనా మరింత విజృంభించే ప్రమాదముందని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌థాక్రే , పంజాబ్‌ సీఎం అమరీందర్‌సింగ్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కోరారు.

ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాలని ప్రధానిని కోరారు. రాష్ట్రాలకు మరిన్ని నిధులు విడుదల చేయాలని కోరారు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ. బెంగాల్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. పంజాబ్‌కు వెంటనే రూ.500 కోట్ల సాయాన్ని ఇవ్వాలని కోరారు ఆ రాష్ట్ర సీఎం అమరీందర్‌సింగ్‌. కరోనా టెస్టింగ్‌ కిట్స్‌ను కూడా భారీగా ఇవ్వాలని పలు రాష్ట్రాల సీఎంలు ప్రధాని మోదీని కోరారు.

కరోనాపై రాష్ట్రాలతో కలిసి ఐకమత్యంగా పోరాడుతున్నామని తెలిపారు ప్రధాని మోదీ. రాష్ట్రాలకు ఎలాంటి సాయం చేయడానికైనా తాను 24 గంటలు సిద్దంగా ఉన్నట్టు చెప్పారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చన్నారు.

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ పొడిగించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగించాలని మోదీతో తెలిపినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేయరాదని సీఎంలు కోరారు. అంతేకాదు కరోనా నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని, అందుకు ఆదుకోవాలని పలువురు ముఖ్యమంత్రులు మోదీని కోరారు.

ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సూచన మేరకు మోదీ కూడా లాక్‌డౌన్‌ పొడిగించేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రధాని మోదీ మాస్క్‌ ధరించి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. మామూలు మాస్క్‌ కాకుండా తెల్లటి వస్త్రంతో తయారు చేసిన మాస్క్‌ను ధరించారు. ఇంట్లో తయారు చేసిన మాస్క్‌లను సైతం వాడవచ్చని గత వారం కేంద్రం సూచించింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు మోదీ ఈ మాస్క్‌ను ధరించినట్లు తెలుస్తోంది.

First Published:  11 April 2020 6:56 AM GMT
Next Story