Telugu Global
Cinema & Entertainment

భారీ డీల్: కరోనా దిల్ రాజుకు బాగా కలిసొచ్చింది...

కరోనాతో సర్వం బంద్ అయిపోయింది. లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ లు, సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలు వడ్డీలు పెరిగిపోయి వామ్మో వాయ్యో అనాలి. కానీ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కు మాత్రం కరోనా కలిసి వచ్చిందన్న చర్చ ఫిలింనగర్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం కరోనాతో సినిమా థియేటర్లు, మల్టిప్లెక్స్ లు మూతపడ్డాయి. జనాలు అంతా ఇంట్లోనే ఉన్నారు. సీరియళ్లు ఆగిపోయి […]

భారీ డీల్: కరోనా దిల్ రాజుకు బాగా కలిసొచ్చింది...
X

కరోనాతో సర్వం బంద్ అయిపోయింది. లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ లు, సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలు వడ్డీలు పెరిగిపోయి వామ్మో వాయ్యో అనాలి. కానీ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కు మాత్రం కరోనా కలిసి వచ్చిందన్న చర్చ ఫిలింనగర్ లో వినిపిస్తోంది.

ప్రస్తుతం కరోనాతో సినిమా థియేటర్లు, మల్టిప్లెక్స్ లు మూతపడ్డాయి. జనాలు అంతా ఇంట్లోనే ఉన్నారు. సీరియళ్లు ఆగిపోయి వేసిన సినిమాలనే వేస్తుంటే జనాలకు బోర్ కొడుతోంది. ఈ నేపథ్యంలో అందరూ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అయిన అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్ వంటి డిజిటల్ ఫ్టాట్ ఫాంలలో నచ్చిన కొత్త సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇప్పుడు ఇదే దిల్ రాజుకు కోట్లు కురిపిస్తోందట.. తెలుగులో నిర్మాతగా దిల్ రాజుకు సక్సెస్ ఫుల్ చరిత్ర ఉంది. ‘దిల్’ సినిమా నుంచి ఇప్పటి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఆయన నిర్మాణ సంస్థలో ఉన్నాయి. దాదాపు 40 సినిమాల వరకు ఆయన నిర్మించాడు.

ఇప్పుడు కరోనాతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమేజాన్ ప్రైమ్ దిల్ రాజు మూవీలన్నింటిని గంపగుత్తగా కొనుగోలుకు ముందుకు వచ్చింది. ఆయన తీసిన 40 సినిమాల్లో దాదాపు 20 సినిమాలను అమేజాన్ ప్రైమ్ కొని స్ట్రీమింగ్ చేస్తోంది. దీనికి గాను బల్క్ గా దిల్ రాజ్ ఊహించనంత మొత్తాన్ని అమేజాన్ ప్రైమ్ చెల్లించిందని సమాచారం. ఇంత కరువులో తన పాత సినిమాకు కోట్లు రావడంతో దిల్ రాజు ఖుషీగా ఉన్నాడట.. ఇప్పుడు ఏ నిర్మాత లేనంత ఆనందంగా దిల్ రాజు ఉన్నాడట.

First Published:  11 April 2020 10:00 PM GMT
Next Story