Telugu Global
Cinema & Entertainment

ఆర్ఆర్ఆర్ వాయిదాపై నిర్మాత క్లారిటీ!

రెండేళ్లలో తీస్తానని అనుకొని మొదలుపెట్టిన బాహుబలి చిత్రం పూర్తయ్యేసరికి ఐదేళ్లు దాటింది. ప్రభాస్ కు పెళ్లి చేసుకునే వయసు దాటిపోయింది. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’కు కూడా ఆ కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఆర్ఆర్ఆర్ కూడా జూలైకి రావాల్సింది వచ్చే సంక్రాంతికి వాయిదా పడింది. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో వచ్చే వేసవికి వాయిదా పడనుందనే వార్త వచ్చింది. ఈ భారీ బడ్జెట్ చిత్రం 2021 ఏప్రిల్ 28కి వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. ఇది సినీ ప్రేమికులను […]

ఆర్ఆర్ఆర్ వాయిదాపై నిర్మాత క్లారిటీ!
X

రెండేళ్లలో తీస్తానని అనుకొని మొదలుపెట్టిన బాహుబలి చిత్రం పూర్తయ్యేసరికి ఐదేళ్లు దాటింది. ప్రభాస్ కు పెళ్లి చేసుకునే వయసు దాటిపోయింది. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’కు కూడా ఆ కష్టాలు తప్పేలా కనిపించడం లేదు.

ఆర్ఆర్ఆర్ కూడా జూలైకి రావాల్సింది వచ్చే సంక్రాంతికి వాయిదా పడింది. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో వచ్చే వేసవికి వాయిదా పడనుందనే వార్త వచ్చింది. ఈ భారీ బడ్జెట్ చిత్రం 2021 ఏప్రిల్ 28కి వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. ఇది సినీ ప్రేమికులను నిరాశకు గురిచేశాయి.

తాజాగా ఈ వార్తలపై ఆర్ఆర్ఆర్ టీం స్పందించింది. దీనిపై నిర్మాత డీవీవీ దానయ్య వివరణ ఇచ్చాడు. ఈ ఏడాది జనవరి నాటికే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ 60శాతం షూటింగ్ పూర్తయ్యిందని తెలిపాడు. వేసవి చివరినాటికి విడుదల చేయడం వల్ల నాణ్యత విషయంలో రాజీపడవద్దనే వచ్చే 2021 సంక్రాంతి సీజన్ కు వాయిదా వేశామన్నారు.

అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి వీలుగానే సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశామన్నారు. కరోనాతో నెలరోజులు సమయం పోయినా ఇంకా చాలా సమయం ఉందని.. ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నామన్నారు. జూన్ నుంచి ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు. అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు.

మరి సినిమాకు సంవత్సరాలు సంవత్సరాలు తీసుకునే రాజమౌళి… అనుకున్న సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తాడా లేదా అన్నది వేచిచూడాలి.

First Published:  13 April 2020 8:25 AM GMT
Next Story