Telugu Global
Cinema & Entertainment

మహేష్ ప్లానింగ్ కు గండికొట్టిన ఆర్ఆర్ఆర్

లెక్కప్రకారం ఆర్ఆర్ఆర్ మూవీ 3 నెలల్లో థియేటర్లలోకి రావాలి. కానీ ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయబోతున్నట్టు రాజమౌళి ప్రకటించాడు. దీంతో చాలా సినిమాలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాయి. ఇప్పుడు ఈ తేదీని కూడా రాజమౌళి వదిలేస్తున్నాడని వార్తలొచ్చాయి. కరోనా వల్ల సినిమా మరింత ఆలస్యం అవుతుండడంతో.. జనవరి 8 నుంచి ఏప్రిల్ కు ఆర్ఆర్ఆర్ రిలీజ్ ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నాడని ప్రచారం కూడా జరిగింది. […]

మహేష్ ప్లానింగ్ కు గండికొట్టిన ఆర్ఆర్ఆర్
X

లెక్కప్రకారం ఆర్ఆర్ఆర్ మూవీ 3 నెలల్లో థియేటర్లలోకి రావాలి. కానీ ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయబోతున్నట్టు రాజమౌళి ప్రకటించాడు. దీంతో చాలా సినిమాలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాయి. ఇప్పుడు ఈ తేదీని కూడా రాజమౌళి వదిలేస్తున్నాడని వార్తలొచ్చాయి. కరోనా వల్ల సినిమా మరింత ఆలస్యం అవుతుండడంతో.. జనవరి 8 నుంచి ఏప్రిల్ కు ఆర్ఆర్ఆర్ రిలీజ్ ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నాడని ప్రచారం కూడా జరిగింది.

మరీ ముఖ్యంగా తన బాహుబలి రిలీజ్ డేట్ అయిన ఏప్రిల్ 28న ఆర్ఆర్ఆర్ ను థియేటర్లలోకి తీసుకురావాలని రాజమౌళి భావిస్తున్నాడట. అయితే ఈ వార్తలపై ఆర్ఆర్ఆర్ నిర్మాత స్పందించాడన్న వార్తలు వచ్చినప్పటికీ మహేష్ బాబుకు నమ్మకం కుదరడం లేదట.

అయితే ఇప్పుడీ మొత్తం వ్యవహారం మహేష్ బాబుకు చుట్టుకుంది. ఎందుకంటే, ఏప్రిల్ లో థియేటర్లలోకి రావాలనేది మహేష్ ఆలోచన. ఆర్ఆర్ఆర్ రాకతో ఇప్పుడు మహేష్ మరో తేదీ వెదుక్కోవాల్సిన పరిస్థితి.

పరశురామ్ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు మహేష్. ఆ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనేది ప్లాన్. కానీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఆ తేదీకి రావడంతో మహేష్ ఇరకాటంలో పడ్డాడు. పోనీ మే నెలకు పోస్ట్ పోన్ చేద్దామంటే, మహేష్ కు ఆ నెల అచ్చిరాదు. అందుకే ఆర్ఆర్ఆర్ కు పోటీగానే వెళ్దామని మహేష్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

గతంలో బాహుబలి-1 టైమ్ లో కూడా ఇలానే జరిగింది. బాహుబలి-1 వచ్చిన వారం రోజులకే మహేష్ నటించిన శ్రీమంతుడు వచ్చింది. బాహుబలిని తట్టుకొని నిలబడగలిగింది. ఈసారి కూడా అలానే పోటీకి దిగుదామని మహేష్ భావిస్తున్నాడు.

First Published:  13 April 2020 11:00 PM GMT
Next Story