Telugu Global
Cinema & Entertainment

పోలీసులతో విజయ్ దేవరకొండ.... ఏం చేశాడంటే....

ఇది కరోనా టైం.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ తో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది మాత్రం మన కోసం ఈ అత్యవసర సమయంలో ప్రాణాలకు తెగించి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. పోలీసులు అయితే జనాలను రోడ్డెక్కకుండా చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ విజయం సాదిస్తున్నారు. పోలీసుల సేవలకు అన్ని వైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. పోలీసుల ఉత్సాహాన్ని మరింత పెంచడానికి తాజాగా హీరో విజయ్ దేవరకొండ రంగంలోకి దిగారు. హైదరాబాద్ నగర […]

పోలీసులతో విజయ్ దేవరకొండ.... ఏం చేశాడంటే....
X

ఇది కరోనా టైం.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ తో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది మాత్రం మన కోసం ఈ అత్యవసర సమయంలో ప్రాణాలకు తెగించి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు.

పోలీసులు అయితే జనాలను రోడ్డెక్కకుండా చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ విజయం సాదిస్తున్నారు. పోలీసుల సేవలకు అన్ని వైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

పోలీసుల ఉత్సాహాన్ని మరింత పెంచడానికి తాజాగా హీరో విజయ్ దేవరకొండ రంగంలోకి దిగారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, ఐపీఎస్ అదికారులతో కలిసి తాజాగా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

పోలీసుల్లో ఉత్సాహం పెంచడానికి తాజాగా హైదరాబాద్ సీపీ కార్యాలయంలో జిల్లాలు, హైదరాబాద్ లోని పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ లో విజయ్ పాల్గొన్నారు. తెరపై తాము హీరోలమని..కానీ నిజజీవితంలో ఇంత సేవ చేస్తున్న నిజమైన హీరోలు తెలంగాణ పోలీసులు అని.. వారి ప్రయత్నాలు గొప్పవని విజయ్ దేవరకొండ తాజాగా మాట్లాడుతూ వారిలో భరోసానింపారు. పోలీసులతో అప్యాయంగా మాట్లాడి వారిలో మనోధైర్యాన్ని పెంచారు.

విజయ్ దేవరకొండ ఇచ్చిన ప్రోత్సాహంపై పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. ఇలా సమాజం కోసం మంచి పనిచేసిన విజయ్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

First Published:  14 April 2020 2:50 AM GMT
Next Story