Telugu Global
Cinema & Entertainment

సర్ ప్రైజ్: అల్లు అర్జున్ తో క్రేజీ డైరెక్టర్...!

అర్జున్ రెడ్డి. టాలీవుడ్ ను, బాలీవుడ్ ను షేక్ చేసి ఈ మూవీ చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు.. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా తీసిన సందీప్ రెడ్డి వంగా ఆ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో హిందీలోనూ అవకాశం దక్కించుకున్నాడు. హిందీలో ఇదే అర్జున్ రెడ్డిని షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ పేరుతో తెరకెక్కించాడు. అక్కడ కూడా సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇక క్రేజీ డైరెక్టర్ గా సందీప్ రెడ్డి […]

సర్ ప్రైజ్: అల్లు అర్జున్ తో క్రేజీ డైరెక్టర్...!
X

అర్జున్ రెడ్డి. టాలీవుడ్ ను, బాలీవుడ్ ను షేక్ చేసి ఈ మూవీ చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు.. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా తీసిన సందీప్ రెడ్డి వంగా ఆ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో హిందీలోనూ అవకాశం దక్కించుకున్నాడు.

హిందీలో ఇదే అర్జున్ రెడ్డిని షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ పేరుతో తెరకెక్కించాడు. అక్కడ కూడా సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇక క్రేజీ డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగా మారాడు.

హిందీ, తెలుగులో ప్రభాస్ తో ప్యాన్ ఇండియా యాక్షన్ డ్రామా మూవీ తీయాలని సందీప్ రెడ్డి ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆ తరువాత బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో తీద్దామనుకున్నా ఆ సినిమా పట్టాలెక్కలేదు. దీంతో ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న ఈ డైరెక్టర్ బన్నీ కోసం ఓ మంచి కథ సిద్ధం చేశాడట.

తాజాగా సందీప్ వంగా చెప్పిన స్క్రిప్ట్ ను బన్నీ కనుక ఓకే చేస్తే… ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న ‘పుష్ప’ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే చిత్రంగా మారడం ఖాయం.. ఈ క్రేజీ కలయిక మరి రూపుదాలుస్తుందా అనేది వేచిచూడాల్సిందే.

First Published:  16 April 2020 9:17 AM GMT
Next Story