Telugu Global
Cinema & Entertainment

హీరోయిన్ విషయంలో పవన్ లైట్ తీసుకుంటాడా?

కరోనా కలకలం లేకపోతే ఈపాటికి పవన్ రీఎంట్రీ మూవీ రెడీ అయి ఉండేది. ఆఖరి షెడ్యూల్ ఉందనగా, లాక్ డౌన్ కారణంగా టోటల్ షూటింగ్ ఆగిపోయింది. మరోవైపు లాక్ డౌన్ ను కూడా పొడిగించడం సినిమాపై మరింత ప్రభావం చూపించింది. దీంతో మూవీకి సంబంధించి ఓ భారీ మార్పు చేశారు. హీరోయిన్ లేకుండానే వకీల్ సాబ్ సినిమాను పూర్తిచేయాలని నిర్ణయించారు. అంటే.. నెక్ట్స్ షెడ్యూల్ లో కేవలం ప్యాచ్ వర్క్ మాత్రం పూర్తిచేసి సినిమాను సిద్ధం చేస్తారన్నమాట. […]

హీరోయిన్ విషయంలో పవన్ లైట్ తీసుకుంటాడా?
X

కరోనా కలకలం లేకపోతే ఈపాటికి పవన్ రీఎంట్రీ మూవీ రెడీ అయి ఉండేది. ఆఖరి షెడ్యూల్ ఉందనగా, లాక్ డౌన్ కారణంగా టోటల్ షూటింగ్ ఆగిపోయింది. మరోవైపు లాక్ డౌన్ ను కూడా పొడిగించడం సినిమాపై మరింత ప్రభావం చూపించింది. దీంతో మూవీకి సంబంధించి ఓ భారీ మార్పు చేశారు. హీరోయిన్ లేకుండానే వకీల్ సాబ్ సినిమాను పూర్తిచేయాలని నిర్ణయించారు. అంటే.. నెక్ట్స్ షెడ్యూల్ లో కేవలం ప్యాచ్ వర్క్ మాత్రం పూర్తిచేసి సినిమాను సిద్ధం చేస్తారన్నమాట.

నిజానికి ఒరిజినల్ పింక్ లో హీరో పాత్రకు హీరోయిన్ లేదు. కానీ తెలుగులో మాత్రం వకీల్ సాబ్ పవన్ కోసం హీరోయిన్ ను సెట్ చేశారు. ఆ మేరకు కథ, స్క్రీన్ ప్లే కొంచెం మార్చారు. హీరోయిన్ గా శృతిహాసన్ ను కూడా ఫైనల్ చేశారు. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుంది. అదే టైమ్ లో కరోనా లాక్ డౌన్ మొదలైంది. దీంతో హీరోయిన్ పోర్షన్ లేకుండానే స్క్రీన్ ప్లేలో మార్పులు చేసి సినిమాను సిద్ధం చేయాలని యూనిట్ నిర్ణయించింది.

అయితే ఈ మార్పులకు పవన్ కల్యాణ్ ఒప్పుకుంటాడా అనేది ఇక్కడ ప్రశ్న. తన ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి అంశం పవన్ కనుసన్నల్లో జరగాల్సిందే. చివరికి ఎడిటింగ్ వర్క్ కూడా పవన్ దగ్గరుండి చూసుకుంటాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇదే విధానాన్ని ఫాలో అవుతున్న పవన్.. వకీల్ సాబ్ విషయానికొచ్చేసరికి ఎలా వ్యవహరిస్తాడో చూడాలి. పవన్ పట్టుబడితే మరో హీరోయిన్ తో షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు. పవన్ కూడా లైట్ తీసుకుంటే.. హీరోయిన్ లేకుండానే వకీల్ సాబ్ థియేటర్లలోకి వస్తుంది.

First Published:  16 April 2020 2:00 AM GMT
Next Story