Telugu Global
National

కేంద్రం సూచనలు పక్కకు... కేసీఆర్ మాటే ఫైనల్..!

కరోనా వైరస్ దేశంలో ప్రవేశించిన వెంటనే కట్టడి చర్యలు తీసుకున్న తొలి రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నిర్ణయాని కంటే ముందే సీఎం కేసీఆర్ కరోనా కట్టడికి పలు చర్యలు తీసుకున్నారు. గాంధీ ఆసుపత్రిని కోవిడ్-19 చికిత్సల కోసం సిద్దం చేయడమే కాకుండా.. ప్రభుత్వం తరపున ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పలు అధ్యయనాల్లో తెలిసిన విషయం ఏమంటే.. కరోనా కట్టడికి లాక్‌డౌన్ మాత్రమే సరైన పరిష్కారమని తెలిపాయి. కరోనాను […]

కేంద్రం సూచనలు పక్కకు... కేసీఆర్ మాటే ఫైనల్..!
X

కరోనా వైరస్ దేశంలో ప్రవేశించిన వెంటనే కట్టడి చర్యలు తీసుకున్న తొలి రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నిర్ణయాని కంటే ముందే సీఎం కేసీఆర్ కరోనా కట్టడికి పలు చర్యలు తీసుకున్నారు. గాంధీ ఆసుపత్రిని కోవిడ్-19 చికిత్సల కోసం సిద్దం చేయడమే కాకుండా.. ప్రభుత్వం తరపున ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా పలు అధ్యయనాల్లో తెలిసిన విషయం ఏమంటే.. కరోనా కట్టడికి లాక్‌డౌన్ మాత్రమే సరైన పరిష్కారమని తెలిపాయి. కరోనాను నాశనం చేయలేకపోయినా.. వైరస్ వ్యాప్తి వేగాన్ని లాక్‌డౌన్ కారణంగా తగ్గించవచ్చని.. తద్వారా ప్రభుత్వం రోగుల చికిత్స, ఐసోలేషన్, పునరావాసం వంటి వాటిపై దృష్టి సారించే అవకాశం దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు.

మార్చి 22న ‘జనతా కర్ఫ్యూ’ పేరుతో కేంద్ర ప్రభుత్వం 12 గంటల పాటు లాక్‌డౌన్ చేసింది. అదే రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయి లాక్‌డౌన్ ప్రకటించారు. మార్చి 23 నుంచి తెలంగాణ సరిహద్దులు మూసేయడమే కాకుండా.. నిత్యావసరాలు తప్ప అన్ని వ్యాపారాలు మూసేయించారు. ప్రజలు గుంపులుగా బయటకు రావడాన్ని నిషేధించారు.

ఈ క్రమంలో ఏప్రిల్ 11న సమీక్ష నిర్వహించిన కేసీఆర్ రాష్ట్రంలో లాక్‌డౌన్ ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ప్రధాని మోడీ మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగించారు. కాని ఈ నెల 20 తర్వాత సడలింపులు ఇస్తామని చెప్పారు. ఆ మేరకు లాక్‌డౌన్ నిబంధనల మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.

లాక్‌డౌన్‌లో నిబంధలను సడలించడం ద్వారా ప్రజలు ఏప్రిల్ 20 తర్వాత రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని.. దీంతో ఇన్నాళ్లూ చేసిన కట్టడికి అర్థం లేకుండా పోతుందని పలువురు భావిస్తున్నారు. కాని సీఎం కేసీఆర్ మాత్రం కేంద్రం సూచనలను పట్టించుకునేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో ఇంకా పాజిటీవ్ కేసులు పెరిగిపోతున్న దశలో సడలింపులతో ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమేనని కేసీఆర్ అంటున్నారు. అందుకే కేంద్రం సడలింపులు ఇచ్చినా.. రాష్ట్రంలో మాత్రం కఠిన నిబంధనలే అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

వ్యవసాయం, దాని సంబంధిత రంగాలకు తప్ప వేటికీ సడలింపులు ఇవ్వకూడదని కేసీఆర్ అనుకుంటున్నారు. ఇప్పటికే పలు ప్రెస్ మీట్లలో ఇదే విషయాన్ని కేసీఆర్ చెప్పారు. కంటైన్మెంట్, నాన్ కంటైన్మెంట్ జోన్లలో మే 3 వరకు కఠిన నిబంధనలే అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మార్గదర్శకాలపై కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అని తెలుస్తోంది.

First Published:  17 April 2020 1:48 AM GMT
Next Story