Telugu Global
Cinema & Entertainment

మహేష్ పై క్లారిటీ ఇచ్చిన కొరటాల

ఆచార్య సినిమాలోకి మహేష్ ఇలా ఎంటరై అలా తప్పుకున్నాడు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మహేష్ ను అనుకున్నారు. ఆ తర్వాత మహేష్ స్థానంలో రామ్ చరణ్ నే తీసుకోబోతున్నట్టు చిరు ప్రకటించారు. అసలు మహేష్ పేరు ఎందుకు తెరపైకొచ్చింది. మళ్లీ ఎందుకు వెనక్కి వెళ్లిపోయింది. ఈ మేటర్ పై ఎట్టకేలకు దర్శకుడు కొరటాల శివ స్పందించాడు. ఆచార్యలో మహేష్ ఎంట్రీకి సంబంధించి అసలేం జరిగిందో వివరంగా చెప్పుకొచ్చాడు కొరటాల. […]

మహేష్ పై క్లారిటీ ఇచ్చిన కొరటాల
X

ఆచార్య సినిమాలోకి మహేష్ ఇలా ఎంటరై అలా తప్పుకున్నాడు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మహేష్ ను అనుకున్నారు. ఆ తర్వాత మహేష్ స్థానంలో రామ్ చరణ్ నే తీసుకోబోతున్నట్టు చిరు ప్రకటించారు. అసలు మహేష్ పేరు ఎందుకు తెరపైకొచ్చింది. మళ్లీ ఎందుకు వెనక్కి వెళ్లిపోయింది. ఈ మేటర్ పై ఎట్టకేలకు దర్శకుడు కొరటాల శివ స్పందించాడు.

ఆచార్యలో మహేష్ ఎంట్రీకి సంబంధించి అసలేం జరిగిందో వివరంగా చెప్పుకొచ్చాడు కొరటాల. ఈ సినిమాలో ముందుగా చరణ్ నే అనుకున్నారట. చిరు కూడా దానికి ఓకే చెప్పారు. ఈలోగా ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ లేట్ అవుతుందనే విషయం బయటకొచ్చింది. అటు ఆచార్య కూడా లేట్ అవుతుందంటూ వార్తలు వచ్చాయి. దీంతో బాగా టెన్షన్ పడిన కొరటాల, ఈ విషయాన్ని మహేష్ తో షేర్ చేసుకున్నాడట.

అంతా విన్న మహేష్ బాబు.. కొరటాలకు ధైర్యం చెప్పాడట. నేనున్నానంటూ భరోసా ఇచ్చాడట. మహేష్ లాంటి స్టార్ హీరో అలా భరోసా ఇచ్చేసరికి ఆశ్చర్యపోయాడట కొరటాల. ఇదే విషయాన్ని కొంతమందితో షేర్ చేసుకుంటే అది అలా బయటకొచ్చేసిందని చెబుతున్నాడు. ఇలా ఆచార్య సినిమాలో మహేష్ బాబు పేరు ఎందుకు ప్రస్తావనకు వచ్చిందో వివరించాడు ఈ సూపర్ హిట్ దర్శకుడు.

First Published:  17 April 2020 9:00 AM GMT
Next Story