Telugu Global
Cinema & Entertainment

వెబ్ సిరీస్ విశేషాలు చెప్పిన తెలుగు హీరోయిన్

ఈషా రెబ్బాకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. వస్తున్న సినిమాలు చేస్తూనే మెల్లగా వెబ్ సిరీస్ ల వైపు షిఫ్ట్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగా హిందీలో హిట్టయిన లస్ట్ స్టోరీస్ ను తెలుగులో రీమేక్ చేస్తోంది. హిందీలో కియరా అద్వానీకి సూపర్ క్రేజ్ తీసుకొచ్చిన పాత్రను తెలుగులో ఈషా రెబ్బా పోషిస్తోంది. ఈ హాట్ సిరీస్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు దీనిపై క్లారిటీ ఇచ్చింది ఈ తెలుగమ్మాయి. లస్ట్ స్టోరీస్ 4 భాగాలుగా […]

వెబ్ సిరీస్ విశేషాలు చెప్పిన తెలుగు హీరోయిన్
X

ఈషా రెబ్బాకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. వస్తున్న సినిమాలు చేస్తూనే మెల్లగా వెబ్ సిరీస్ ల వైపు షిఫ్ట్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగా హిందీలో హిట్టయిన లస్ట్ స్టోరీస్ ను తెలుగులో రీమేక్ చేస్తోంది. హిందీలో కియరా అద్వానీకి సూపర్ క్రేజ్ తీసుకొచ్చిన పాత్రను తెలుగులో ఈషా రెబ్బా పోషిస్తోంది. ఈ హాట్ సిరీస్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు దీనిపై క్లారిటీ ఇచ్చింది ఈ తెలుగమ్మాయి.

లస్ట్ స్టోరీస్ 4 భాగాలుగా తెలుగులో వస్తోందట. 3 భాగాలకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందట. అయితే నాలుగో భాగానికి సంబంధించిన షూట్ మాత్రం పెండింగ్ లో పడిందని చెబుతోంది. అందుకే ఈనెలలోనే రిలీజ్ అవ్వాల్సిన లస్ట్ స్టోరీస్.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేం అంటోంది.

ఈషా రెబ్బా నటించిన సిరీస్ ను సంకల్ప్ రెడ్డి డైరక్ట్ చేశాడు. ఈ సిరీస్ పై చాలా హోప్స్ పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. వెబ్ సిరీస్ తో క్లిక్ అయితే ఇక అటువైపు ఎక్కువ ఫోకస్ పెట్టాలనేది ఈమె ప్లాన్.

First Published:  18 April 2020 7:01 AM GMT
Next Story