Telugu Global
Cinema & Entertainment

యాంకర్ గా మారబోతున్న హీరోయిన్

కెరీర్ చరమాంకంలో ఉన్నప్పుడు ఒక్కో హీరోయిన్ ఒక్కో నిర్ణయం తీసుకుంటుంది. ఎక్కువమంది పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు. మరికొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోతారు. ఇంకొంతమంది వెబ్ సిరీస్ ల వైపు వెళ్తారు. అయితే హీరోయిన్ ఇలియానా మాత్రం భిన్నమైన రూటు తీసుకుంది. అవును.. ప్రస్తుతం అవకాశాల్లేక ఇబ్బంది పడుతున్న ఈ ముద్దుగుమ్మ.. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే యాంకర్ గా మారబోతోంది. ఓ ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ ఇలియానాతో చర్చలు ప్రారంభించింది. మంచి ప్యాకేజీ కూడా ఆఫర్ […]

యాంకర్ గా మారబోతున్న హీరోయిన్
X

కెరీర్ చరమాంకంలో ఉన్నప్పుడు ఒక్కో హీరోయిన్ ఒక్కో నిర్ణయం తీసుకుంటుంది. ఎక్కువమంది పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు. మరికొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోతారు. ఇంకొంతమంది వెబ్ సిరీస్ ల వైపు వెళ్తారు. అయితే హీరోయిన్ ఇలియానా మాత్రం భిన్నమైన రూటు తీసుకుంది. అవును.. ప్రస్తుతం అవకాశాల్లేక ఇబ్బంది పడుతున్న ఈ ముద్దుగుమ్మ.. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే యాంకర్ గా మారబోతోంది.

ఓ ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ ఇలియానాతో చర్చలు ప్రారంభించింది. మంచి ప్యాకేజీ కూడా ఆఫర్ చేసింది. ఇలియానా కూడా దాదాపు డీల్ కు ఓకే చెప్పేసింది. ఇంతలోనే కరోనా వచ్చింది. అన్ని పనులు ఆగిపోయాయి. దీంతో యాంకర్ గా ఇలియానా ఎంట్రీ కూడా ఆలస్యమైపోయింది.

ప్రస్తుతానికైతే యాంకర్ గా మారాలా వద్దా, డీల్ కు ఒప్పుకోవాలో వద్దా అనే డైలమాలో ఉంది ఇలియానా. ఎందుకంటే ఒకసారి యాంకర్ గా మారితే, ఇక హీరోయిన్ అవకాశాలు వదులుకున్నట్టే. ప్రస్తుతం ఈమె చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. బాలీవుడ్ లో అభిషేక్ బచ్చన్ హీరోగా ఓ సినిమా చేస్తోంది ఇలియానా. తెలుగు నుంచి ఆఫర్లు వస్తున్నప్పటికీ ఈమె చెబుతున్న రేటుకు నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు. రేటు తగ్గించడానికి ఇలియానా ఒప్పుకోవడం లేదు.

First Published:  17 April 2020 10:36 PM GMT
Next Story