Telugu Global
International

గుడ్‌న్యూస్ : కరోనాకు అద్భుత చికిత్స కనిపెట్టిన అమెరికా కంపెనీ

ప్రపంచ దేశాలను కబలిస్తూ.. మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేసిన కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు సరైన చికిత్సా విధానం లేదు. ఎక్కడికక్కడ వైద్యులు రోగ లక్షణాలను బట్టి చికిత్స చేసుకుంటూ వెళ్తున్నారు. అజిత్రోమైసిన్, పారసిటమల్ ట్యాబ్లెట్స్, విటమిన్ గోళీలు ఇవ్వడంతో పాటు కొద్ది మోతాదులో హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు కూడా ఇస్తూ రోగాన్ని అదుపులో చేసే ప్రయత్నం చేస్తున్నారు. రోగ నిరోధక వ్యవస్థ శక్తి పెంచి కరోనా నుంచి కోలుకునేలా చేస్తున్నారు. అంతే తప్ప ఇప్పటి వరకు ప్రపంచంలో […]

గుడ్‌న్యూస్ : కరోనాకు అద్భుత చికిత్స కనిపెట్టిన అమెరికా కంపెనీ
X

ప్రపంచ దేశాలను కబలిస్తూ.. మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేసిన కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు సరైన చికిత్సా విధానం లేదు. ఎక్కడికక్కడ వైద్యులు రోగ లక్షణాలను బట్టి చికిత్స చేసుకుంటూ వెళ్తున్నారు. అజిత్రోమైసిన్, పారసిటమల్ ట్యాబ్లెట్స్, విటమిన్ గోళీలు ఇవ్వడంతో పాటు కొద్ది మోతాదులో హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు కూడా ఇస్తూ రోగాన్ని అదుపులో చేసే ప్రయత్నం చేస్తున్నారు. రోగ నిరోధక వ్యవస్థ శక్తి పెంచి కరోనా నుంచి కోలుకునేలా చేస్తున్నారు. అంతే తప్ప ఇప్పటి వరకు ప్రపంచంలో దీనికి చికిత్సే లేదు.

కాగా, మానవుడు కరోనా బారి నుంచి తప్పించుకోవాలంటే వ్యాక్సిన్ అభివృద్ది చేయక తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థే వ్యాఖ్యానించింది. ఇప్పటికే అమెరికా, చైనా, జపాన్, బ్రిటన్ పరిశోధకులు వ్యాక్సిన్ అభివృద్ధిపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా పరిశోధకులు ఒక ముందడుగు వేశారు. గిలియోడ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ కరోనా కోసం ఒక చికిత్సా విధానాన్ని కనిపెట్టింది. ఇది ఇప్పుడు మెరుగైన ఫలితాలు ఇవ్వడంతో అందరి దృష్టి దీనిపై పడింది.

చికాగోలోని ఒక ఆసుపత్రిలోని రోగులపై ఈ చికిత్సా విధానాన్ని ప్రయోగించగా వాళ్లందరూ కరోనా బారి నుంచి త్వరితగతిన కోలుకున్నారు. 113 మంది రోగులు ఈ విధానంలో చికిత్స ద్వారా స్వస్థత పొందారని ఫార్మా కంపెనీ తెలియజేస్తోంది. ఈ విధానంలో జలుబు, జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు వెంటనే తగ్గిపోయాయని చెబుతోంది.

కరోనాతో బాధపడుతున్న స్టేజ్ 3 రోగులపై కూడా పరీక్షలు చేశామని.. మే తొలి వారంలో వాటికి సంబంధించిన వివరాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేస్తామని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం అమెరికాలోని 152 ప్రాంతాల్లో ఈ చికిత్సా విధానంపై ప్రయోగాలు జరుపుతున్నామని గిలియెడ్ సైన్స్ చెబుతోంది.

ప్రస్తుతం గిలియెడ్ సైన్స్ పరిశోధనలపై ప్రపంచ ఫార్మా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. సంస్థ పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తుండడంతో ప్రపంచంలోని మార్కెట్లన్నీ దానివైపే చూస్తున్నాయి. స్టాక్‌ మార్కెట్‌లోనూ ఆ సంస్థ షేర్లు భారీగా పెరగడం గమనార్హం. అన్నీ అనుకూలిస్తే మే చివరి వారంలోగా కరోనాకు చికిత్సా విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  18 April 2020 10:44 PM GMT
Next Story