Telugu Global
National

ఏపీలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపు

కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, కఠినమైన లాక్‌డౌన్ నిబంధనల వల్ల ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతోందని.. కొన్ని మినహాయింపులు ఇవ్వాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సోమవారం (ఏప్రిల్ 20) నుంచి లాక్‌డౌన్ నిబంధనల్లో మార్పులు చేసింది. కొన్ని రంగాలకు మినహాయింపులు కూడా ఇచ్చింది. పూర్తిగా వ్యవసాయాధార రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొన్ని మినహాయింపులు ఇవ్వాలని సీఎం జగన్ […]

ఏపీలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపు
X

కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, కఠినమైన లాక్‌డౌన్ నిబంధనల వల్ల ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతోందని.. కొన్ని మినహాయింపులు ఇవ్వాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరిగింది.

దీంతో కేంద్ర ప్రభుత్వం సోమవారం (ఏప్రిల్ 20) నుంచి లాక్‌డౌన్ నిబంధనల్లో మార్పులు చేసింది. కొన్ని రంగాలకు మినహాయింపులు కూడా ఇచ్చింది. పూర్తిగా వ్యవసాయాధార రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొన్ని మినహాయింపులు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు.

గతంలో పీఎం మోడీకి వైఎస్ జగన్ పలు సూచనలు చేశారు. జోన్ల వారిగా లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేయాలని కోరారు. ఇప్పుడు ఎలాగో కేంద్ర సడలింపులు ఇవ్వడంతో.. ఏపీ ప్రభుత్వం కూడా కొన్ని మినమాయింపులను ఇవ్వడానికి నిర్ణయించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఈ సడలింపులు రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లకు వర్తించవని దానిలో పేర్కొన్నారు.

ఏపీ లాక్‌డౌన్ సడలింపులు వర్తించేది వీటికే

  • ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచే పరిశ్రమలు
  • రైస్ మిల్లులు, పప్పుల మిల్లులు, పిండి మిల్లులు, డైరీ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు.
  • ఈ-కామర్స్ సంస్థలు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కార్యాకలాపాలు కొనసాగించవచ్చు.
  • ఎస్ఈజెడ్‌లు, ఎగుమతుల యూనిట్లు, విశాఖపట్నంలోని మెడ్‌టెక్ జోన్ పరిశ్రమలు
  • ఆహార ఉత్పత్తి పరిశ్రమలు, ఔషధ తయారీ సంస్థలు, సబ్బుల తయారీ పరిశ్రమలు
  • నీటి శుద్ది కంపెనీలు, ఆర్వో ప్లాంట్లు
  • ఐటీ, హార్డ్ వేర్ కంపెనీలు
  • బోగ్గు గనులు, చమురు, గ్యాస్ ఉత్పత్తి కంపెనీలు
  • వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, శాస్త్రవేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తారు
  • విమాన సర్వీసులు (చార్టెడ్ ఫ్లైట్స్)
  • రహదారుల నిర్మాణం
  • ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగించ వచ్చు
  • ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు 50 శాతం ఉద్యోగులతో పని చేయించుకోవచ్చు
  • డేటా సెంటర్లు, కాల్ సెంటర్లు ప్రభుత్వ కార్యాకలాపాల కోసం పని చేయవచ్చు
  • అన్ని రకాల సరుకు రవాణా వాహనాలు, రైళ్ల సరుకు రవానా
  • విమానాశ్రయాలు, పోర్టుల్లో కార్గోకు అవకాశం. కార్మికులకు ప్రత్యేక రక్షణ చర్యలు తప్పనిసరి
  • పరిశ్రమల్లో భౌతిక దూరం పాటిస్తూ, సిబ్బంది మాస్కులు ఇచ్చి పనులు చేయించవచ్చు.

ఇక సడలింపులు ఇచ్చిన పరిశ్రమలు, సంస్థలు ఈ నిబంధనలు పాటించాలి

  • పని ప్రదేశాలు, పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి.
  • రీ స్టార్ట్ అనే విధానం ప్రకారం పరిశ్రమలు పనిచేయాలి. అక్కడకు కార్మికులు, ఉద్యోగులను తరలించే వాహనాల్లో కచ్చితంగా 30శాతం మంది మాత్రమే ఎక్కాలి.
  • లాక్‌డౌన్‌ సమయంలో పనిచేస్తున్న వారందరికీ వైద్యబీమా తప్పనిసరి.
  • పదిమంది కంటే ఎక్కువ గుమిగూడకుండా చూడాలి.
  • గుట్కా, పాన్‌లు నమిలి ఉమ్మి వేయటంపై నిషేధం.
  • ఉత్పత్తి ప్రదేశాల్లోకి బయటి వ్యక్తులు ప్రవేశకుండా చూసుకోవాలి.
First Published:  19 April 2020 7:19 AM GMT
Next Story