Telugu Global
National

తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

అప్పటి వరకు ఎలాంటి మినహాయింపులు లేవు ఇంటి అద్దెలపై మారటోరియం స్కూల్ ఫీజులు పెంచొద్దు గచ్చిబౌలి ఆసుపత్రి టిమ్స్‌గా మార్పు తెలంగాణలో మే 7వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. కరోనా వైరస్ కట్టడి, లాక్‌డౌన్ నిబంధనల అమలు, ఇతర విషయాలపై ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. తెలంగాణలో ఆదివారం వరకు 858 మందికి కరోనా […]

తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
X
  • అప్పటి వరకు ఎలాంటి మినహాయింపులు లేవు
  • ఇంటి అద్దెలపై మారటోరియం
  • స్కూల్ ఫీజులు పెంచొద్దు
  • గచ్చిబౌలి ఆసుపత్రి టిమ్స్‌గా మార్పు

తెలంగాణలో మే 7వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. కరోనా వైరస్ కట్టడి, లాక్‌డౌన్ నిబంధనల అమలు, ఇతర విషయాలపై ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు.

తెలంగాణలో ఆదివారం వరకు 858 మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది. వీరిలో 651 మంది ప్రస్తుతం చికిత్స పొందుతుండగా.. 21 మంది చనిపోయినట్లు కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత మే 1 లోపు తగ్గిపోతోందని భావిస్తున్నానని… మే 3 వరకు కరోనా తీవ్రత తగ్గినా… మరో నాలుగు రోజులు లాక్‌డౌన్‌లోనే ఉండాలని కేబినెట్ నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.

తెలంగాణలో యాదాద్రి భువనగిరి, వరంగల్ అర్బన్, సిద్దిపేట, వనపర్తి జిల్లాల్లో ఒక్క కరోనా కేసు లేదని చెప్పారు. ఇక రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, స్వయంగా చేసిన సర్వేల మేరకు మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నామని అన్నారు. మే 5న కేబినెట్ భేటీ నిర్వహించి తర్వాత నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

కేంద్ర సడలింపులు ఉండవు….

కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపలు ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ మే 7 వరకు తెలంగాణలో ఎలాంటి సడలింపులు ఉండవని కేసీఆర్ చెప్పారు.

గతంలో ఉన్న నిబంధనలే మే 7 వరకు వర్తిస్తాయని.. వ్యవసాయం, నీటి ప్రాజెక్టులకు ఇచ్చిన మినహాయింపులు కొనసాగుతాయని వివరించారు.

కూరగాయలు, నిత్యావసరాల దుకాణాలు తెరిచే ఉంటాయని చెప్పారు. రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతుందని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఫుడ్ డెలివరీ కంపెనీలైన స్విగ్గీ, జొమాటోల కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. సాధ్యమైనంత వరకు ప్రజలు ఇండ్లలోనే వంట చేసుకొని తినాలని కేసీఆర్ సూచించారు.

ఇక గత నెల మాదిరిగానే వచ్చే నెల కూడా ఉద్యోగుల వేతనాల కోతలు ఉంటాయని… ఇక పెన్షనర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు వారికి మాత్రం 75 శాతం ఇస్తామని చెప్పారు. వైద్య సిబ్బంది, హెచ్ఎండబ్ల్యూ, శానిటేషన్ సిబ్బందికి వచ్చే నెలలో కూడా నగదు పురస్కారం అందిస్తామన్నారు.

పోలీసులు కూడా బాగా కష్టపడుతున్నారని…. వారికి మే నెలలో గ్రాస్ శాలరీలో 10 శాతం కలిపి ఇస్తామని కేసీఆర్ చెప్పారు. విద్యుత్ శాఖలోని ఓ అండ్ ఎం సిబ్బందికి ఈ నెల 100 శాతం జీతం ఇస్తామని కేసీఆర్ చెప్పారు.

ఇక పేదలు, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే పెన్షలు అందుతాయని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెల్లరేషన్ కార్డు దారులకు గతంలో ఇచ్చినట్లే మరోసారి ఉచిత రేషన్ ఇస్తామని చెప్పారు. అంతే కాకుండా మరో దఫా 1500 రూపాయల నగదు పంపిణీ చేస్తామని చెప్పారు.

బ్యాంకులో పడిన డబ్బులు తీసుకోకపోతే ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుందని పుకార్లు పుట్టించారు. అలా ఏమీ జరగదు. మీ అకౌంట్లో నగదు అలాగే ఉంటుంది కాబట్టి.. నెమ్మదిగా తీసుకోవాలని కేసీఆర్ సూచించారు.

మార్చి, ఏప్రిల్, మే నెలల రెంట్లను ఓనర్లు వసూలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తోందని కేసీఆర్ చెప్పారు. ఈ మూడు నెలల కిరాయిని రాబోయే రోజుల్లో విడతల వారీగా వసూలు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. కిరాయిపై వడ్డీని వసూలు చేయవద్దని చెప్పారు. ఏ ఓనర్ అయినా ఇబ్బంది పెడితే 100కి డయల్ చేయవచ్చని అన్నారు.

2019-20 ఆస్తి పన్ను ఎలాంటి అపరాధ రుసుము లేకుండా 31 మే వరకు చెల్లించవచ్చని కేసీఆర్ చెప్పారు. ప్రైవేటు పాఠశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ 2020-21 ఏడాదికి ఫీజులు పెంచరాదని కేసీఆర్ చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. నెల వారీగా ట్యూషన్ ఫీజులు వసూలు చేయాలని.. అంతకు మించి వసూలు చేయరాదని కేసీఆర్ చెప్పారు.

గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్, అక్కడ భూమిని క్రీడా శాఖ నుంచి వైద్య శాఖకు బదిలీ చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. అక్కడ ఏర్పాటు చేసిన ఆసుపత్రిని ఇకపై తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌గా మార్చబోతున్నట్లు చెప్పారు. అక్కడ అనుబంధ మెడికల్ పీజీ కళాశాల కూడా ఏర్పాటు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

First Published:  19 April 2020 11:43 AM GMT
Next Story