Telugu Global
Cinema & Entertainment

గూఢచారి-2పై కరోనా ప్రభావం

గూఢచారి.. అడవిశేష్ కెరీర్ లోనే సూపర్ హిట్ సినిమా. అతడ్ని స్టార్ ను చేసిన సినిమా. ఈ మూవీ తర్వాతే అతడు ఫేమస్ అయ్యాడు. అంత పాపులారిటీ తెచ్చిపెట్టిన గూఢచారికి సీక్వెల్ రాసే పనిలో ఉన్నాడు శేష్. ఈ లాక్ డౌన్ టైమ్ ను గూఢచారి-2 కోసం వాడుకుంటున్నాడు. అయితే కరోనా తర్వాత ప్రపంచంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో అనే ఆందోళనను వ్యక్తంచేస్తున్నాడు. దీనికి ఓ కారణం ఉంది. కథ ప్రకారం గూఢచారి-2 మొత్తం విదేశాల్లోనే జరుగుతుంది. […]

గూఢచారి-2పై కరోనా ప్రభావం
X

గూఢచారి.. అడవిశేష్ కెరీర్ లోనే సూపర్ హిట్ సినిమా. అతడ్ని స్టార్ ను చేసిన సినిమా. ఈ మూవీ తర్వాతే అతడు ఫేమస్ అయ్యాడు. అంత పాపులారిటీ తెచ్చిపెట్టిన గూఢచారికి సీక్వెల్ రాసే పనిలో ఉన్నాడు శేష్. ఈ లాక్ డౌన్ టైమ్ ను గూఢచారి-2 కోసం వాడుకుంటున్నాడు. అయితే కరోనా తర్వాత ప్రపంచంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో అనే ఆందోళనను వ్యక్తంచేస్తున్నాడు. దీనికి ఓ కారణం ఉంది.

కథ ప్రకారం గూఢచారి-2 మొత్తం విదేశాల్లోనే జరుగుతుంది. పైగా 3-4 దేశాల్లో చిత్రీకరించాల్సి ఉంటుంది. కరోనా తర్వాత అన్ని దేశాలకు రాకపోకలు తగ్గిన నేపథ్యంలో.. ఎన్ని దేశాలు షూటింగ్స్ కు అనుమతి ఇస్తాయనేది అనుమానాస్పదంగా మారింది. అదే కనుక జరిగితే గూఢచారి-2కు అడ్డంకులు తప్పవు.

ఈ విషయంపైనే అడివి శేష్ బాధపడుతున్నాడు. అయితే ప్రస్తుతానికి తన సీక్వెల్ కు స్టోరీని మార్చలేదని, విదేశాల్లో ఇక షూటింగ్స్ కష్టమని పక్కాగా తేలినప్పుడు.. అప్పుడు కథలో సన్నివేశాల్ని, పాత్రల్ని, లొకేషన్స్ ను మారుస్తానని అంటున్నాడు.

First Published:  20 April 2020 8:01 PM GMT
Next Story