Telugu Global
Cinema & Entertainment

ఆ హీరోయిన్ రీఎంట్రీ ఇస్తోంది

కలర్స్ స్వాతి.. ఈ హీరోయిన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తెలుగు మాట్లాడే అతికొద్ది హీరోయిన్లలో స్వాతి కూడా ఒకరు. తెలుగు, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత లైఫ్ లో సెటిల్ అయింది. ఓ పైలెట్ ను పెళ్లి చేసుకొని ఇండోనేషియాలో కాపురం పెట్టింది. మళ్లీ ఇన్నాళ్లకు స్వాతికి యాక్టింగ్ పై మనసుమళ్లింది. ఇప్పుడామె రీఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటోంది. అవును.. మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతోంది కలర్స్ […]

ఆ హీరోయిన్ రీఎంట్రీ ఇస్తోంది
X

కలర్స్ స్వాతి.. ఈ హీరోయిన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తెలుగు మాట్లాడే అతికొద్ది హీరోయిన్లలో స్వాతి కూడా ఒకరు. తెలుగు, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత లైఫ్ లో సెటిల్ అయింది. ఓ పైలెట్ ను పెళ్లి చేసుకొని ఇండోనేషియాలో కాపురం పెట్టింది. మళ్లీ ఇన్నాళ్లకు స్వాతికి యాక్టింగ్ పై మనసుమళ్లింది. ఇప్పుడామె రీఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటోంది.

అవును.. మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతోంది కలర్స్ స్వాతి. ఈ మేరకు ఆమె ఓ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. అదే కార్తికేయ-2. నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ సినిమాలో స్వాతి హీరోయిన్ గా నటించింది. ఆ మూవీ స్వాతికి మంచి పేరు తీసుకొచ్చింది. మళ్లీ ఇన్నేళ్లకు అదే సినిమా సీక్వెల్ తో ఆమె రీఎంట్రీ ఇవ్వబోతోంది.

అయితే కార్తికేయ-2లో ఈసారి స్వాతి హీరోయిన్ కాదు. సీక్వెల్ కాబట్టి నిఖిల్ ఎక్స్-లవర్ పాత్రలో మాత్రమే ఆమె కొద్దిసేపు కనిపిస్తుంది. కాకపోతే కథతో ఆమెకు బలమైన లింక్ ఉంటుంది. మెయిన్ హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నారు. రీఎంట్రీలో స్వాతి ఎలా క్లిక్ అవుతుందో చూడాలి.

First Published:  22 April 2020 1:01 AM GMT
Next Story