Telugu Global
Cinema & Entertainment

మరో గెస్ట్ రోల్ లో హాట్ హీరోయిన్

రెడ్ సినిమాలో హెబ్బా పటేల్ ది కేవలం ఐటెంసాంగ్ అనుకుంటున్నారంతా. కానీ ఈ సినిమాలో హెబ్బా పటేల్ ది కేవలం ఐటెం సాంగ్ మాత్రమే కాదు. దానికి కొనసాగింపుగా చిన్న క్యారెక్టర్ కూడా ఉందని చెబుతోంది యూనిట్. లాక్ డౌన్ కారణంగా పోస్ట్ పోన్ అయిన ఈ సినిమాలో హెబ్బా పటేల్ పాత్ర అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుందని చెబుతున్నారు యూనిట్ సభ్యులు. రామ్ హీరోగా నటిస్తున్న రెడ్ సినిమాలో మాళవిక శర్మ, నివేత పెతురాజ్ హీరోయిన్లుగా నటించారు. […]

మరో గెస్ట్ రోల్ లో హాట్ హీరోయిన్
X

రెడ్ సినిమాలో హెబ్బా పటేల్ ది కేవలం ఐటెంసాంగ్ అనుకుంటున్నారంతా. కానీ ఈ సినిమాలో హెబ్బా పటేల్ ది కేవలం ఐటెం సాంగ్ మాత్రమే కాదు. దానికి కొనసాగింపుగా చిన్న క్యారెక్టర్ కూడా ఉందని చెబుతోంది యూనిట్. లాక్ డౌన్ కారణంగా పోస్ట్ పోన్ అయిన ఈ సినిమాలో హెబ్బా పటేల్ పాత్ర అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుందని చెబుతున్నారు యూనిట్ సభ్యులు.

రామ్ హీరోగా నటిస్తున్న రెడ్ సినిమాలో మాళవిక శర్మ, నివేత పెతురాజ్ హీరోయిన్లుగా నటించారు. వీళ్లతో పాటు సెకెండాఫ్ లో హెబ్బా పటేల్ కూడా వస్తుందట. సినిమాను మలుపుతిప్పే కీలకమైన సన్నివేశంలో హెబ్బా రావడంతో పాటు ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ కూడా చేస్తుందట.

రీసెంట్ గా వచ్చిన భీష్మ సినిమాలో కూడా హెబ్బా పటేల్ నటించింది. అందులో ఆమెకు ఐటెంసాంగ్ లేదు కానీ, ఆమె నటించిన సన్నివేశాలు చూస్తే దాదాపు ఐటెం హీరోయిన్ అనిపించుకుంది. అలాంటి సన్నివేశాల్లో నటించిందామె. ఇప్పుడు రెడ్ లో ఏకంగా ఐటెంసాంగ్ చేస్తోంది. చూస్తుంటే.. హీరోయిన్ రోల్స్ కంటే ఇలాంటి ప్రత్యేక పాత్రలకే హెబ్బా ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది.

First Published:  23 April 2020 5:55 AM GMT
Next Story