Telugu Global
Cinema & Entertainment

జీవితం భయంకరంగా ఉంది... వర్మ ఆవేదన... ఆందోళన

రాంగోపాల్ వర్మ.. ఎప్పుడూ వివాదాలతో కాలం గడిపే ఈయన ఎవరినీ లెక్క చేయడు. సీఎంల దగ్గర నుంచి టాలీవుడ్ స్టార్ హీరోలు ఆఖరుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను సైతం తన వ్యాఖ్యలు, ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా రాంగోపాల్ వర్మ కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ తో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలాంటి క్లిష్ట సమయంలో సినీ పరిశ్రమ కూడా మొత్తం బంద్ అయిపోయింది. ఈ […]

జీవితం భయంకరంగా ఉంది... వర్మ ఆవేదన... ఆందోళన
X

రాంగోపాల్ వర్మ.. ఎప్పుడూ వివాదాలతో కాలం గడిపే ఈయన ఎవరినీ లెక్క చేయడు. సీఎంల దగ్గర నుంచి టాలీవుడ్ స్టార్ హీరోలు ఆఖరుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను సైతం తన వ్యాఖ్యలు, ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తారు.

తాజాగా రాంగోపాల్ వర్మ కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ తో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలాంటి క్లిష్ట సమయంలో సినీ పరిశ్రమ కూడా మొత్తం బంద్ అయిపోయింది.

ఈ నేపథ్యంలో కరోనాపై ఇంటర్వ్యూల్లో సెటైర్లు పేలుస్తున్న వర్మ తాజాగా ‘కరోనా ఓ పురుగు’ అంటూ ఓ పాట పాడి కూడా అలరించాడు. అయితే తాజాగా తాను కూడా కరోనాకు భయపడుతున్నానని.. జీవితం భయంకరంగా ఉందని వర్మ ట్వీట్ లో పేర్కొన్నారు.

ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తాజాగా ట్విట్టర్ లో వర్మ గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘1988లో రాంగోపాల్ వర్మ ఓ పుస్తకాల పురుగు. ఇప్పుడు కరోనా పురుగు గురించి తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నారు. సర్.. ఇప్పటికీ స్టీఫెన్ హాకింగ్ రచనలు చదువుతున్నారా?’ అని కీరవాణి ట్వీట్ లో వర్మను అడిగేశాడు.

దానికి వర్మ అంతే చురుకుగా సమాధానమిచ్చాడు.. ‘లేదు సార్ రచనలు చదవడం లేదు. ఆయన రాసిన కల్పిత కథల కంటే మన నిజ జీవితం చాలా భయంకరంగా ఉంది’ అని ఆర్జీవీ ట్వీట్ లో కరోనాతో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన చెందారు. ఎవ్వరికి భయపడని వర్మను సైతం కరోనా భయపెడుతోందని అర్థమైంది.

First Published:  25 April 2020 7:03 AM GMT
Next Story