Telugu Global
Cinema & Entertainment

సినిమాలు తగ్గించిన హెబ్బా పటేల్

ఆమె సినిమాలు తగ్గించింది అనే కంటే.. ఆమెకు అవకాశాలు తగ్గాయని చెప్పడం కరెక్ట్. నిజానికి కెరీర్ స్టార్టింగ్ నుంచి హెబ్బాది ఇదే పరిస్థితి. ఆమెకు అవకాశాలు వెల్లువెత్తలేదు. వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. ఇప్పుడు ఆ సినిమాలు కూడా రావడం మానేశాయి. దీంతో రూటు మార్చింది హెబ్బా పటేల్. ప్రస్తుతం అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్న ఓటీటీ వైపు అడుగులు వేసింది ఈ బ్యూటీ. ఇందులో భాగంగా 2 వెబ్ సిరీస్ లు చేసింది. అవి త్వరలోనే విడుదల […]

సినిమాలు తగ్గించిన హెబ్బా పటేల్
X

ఆమె సినిమాలు తగ్గించింది అనే కంటే.. ఆమెకు అవకాశాలు తగ్గాయని చెప్పడం కరెక్ట్. నిజానికి కెరీర్ స్టార్టింగ్ నుంచి హెబ్బాది ఇదే పరిస్థితి. ఆమెకు అవకాశాలు వెల్లువెత్తలేదు. వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. ఇప్పుడు ఆ సినిమాలు కూడా రావడం మానేశాయి. దీంతో రూటు మార్చింది హెబ్బా పటేల్.

ప్రస్తుతం అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్న ఓటీటీ వైపు అడుగులు వేసింది ఈ బ్యూటీ. ఇందులో భాగంగా 2 వెబ్ సిరీస్ లు చేసింది. అవి త్వరలోనే విడుదల కాబోతున్నాయి. మరో వెబ్ సిరీస్ పై చర్చలు సాగుతున్నట్టు తెలిపింది.

ప్రస్తుతం హెబ్బా చేతిలో రెండే సినిమాలున్నాయి. ఆ రెండు సినిమాల్లో ఆమె హీరోయిన్ కాదు. రెడ్ సినిమాలో ఐటెంసాంగ్ చేసింది. ఒరేయ్ బుజ్జిగా సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. ఇవి మినహా ఆమె సోలో హీరోయిన్ గా నటించే సినిమా ఒక్కటి కూడా లేదు. దీంతో హెబ్బా పటేల్ ఇప్పుడు వెబ్ సిరీస్ వైపు అడుగులు వేస్తోంది.

First Published:  25 April 2020 9:00 AM GMT
Next Story