Telugu Global
CRIME

ఆత్మహత్య చేసుకోబోయిన యువతి... రక్షించిన పోలీసులకు డీజీపీ ప్రశంసలు

కరోనా లాక్‌డౌన్ కాలంలో అందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. గతంలో ఇంత తీరిగ్గా అందరూ ఇండ్లలోనే ఉన్న దాఖలాలు లేవు. దీని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా జరుగుతున్నాయి. చిన్న చిన్న గొడవలే పెద్దగా మారుతున్నాయి. కొంత మంది యువత క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. లాక్ డౌన్ వేళ బయట తిరగొద్దన్నందుకు ఒక యువకుడు హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఇంట్లో మనస్పర్ధల కారణంగా ఒక యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. మంచిర్యాల […]

ఆత్మహత్య చేసుకోబోయిన యువతి... రక్షించిన పోలీసులకు డీజీపీ ప్రశంసలు
X

కరోనా లాక్‌డౌన్ కాలంలో అందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. గతంలో ఇంత తీరిగ్గా అందరూ ఇండ్లలోనే ఉన్న దాఖలాలు లేవు. దీని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా జరుగుతున్నాయి. చిన్న చిన్న గొడవలే పెద్దగా మారుతున్నాయి. కొంత మంది యువత క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. లాక్ డౌన్ వేళ బయట తిరగొద్దన్నందుకు ఒక యువకుడు హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఇంట్లో మనస్పర్ధల కారణంగా ఒక యువతి ఆత్మహత్యాయత్నం చేసింది.

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన యువతి తల్లిదండ్రులతో కలసి ఉంటోంది. అయితే గత కొన్ని రోజులుగా యువతి.. తల్లిదండ్రులతో గొడవ పడుతోంది. ఈ క్రమంలో శనివారం కూడా చిన్న గొడవ జరగడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇంట్లోంచి వెళ్లిపోయింది. గోదావరి బ్రిడ్జి వైపు వేగంగా నడుచుకుంటూ వెళ్తున్న యువతిని గుర్తించిన ఎస్ఐ విజేందర్, మంగీలాల్ ఆమెను ఆపారు. కారణం తెలుసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

క్షణికావేశంలో నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని.. ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని పోలీసులు ఆమెకు నచ్చచెప్పడంతో అమ్మాయి తిరిగి తల్లిదండ్రులను కలుసుకుంది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఇద్దరు పోలీసు అధికారులను ప్రశంసించారు.

ఒక ప్రాణం పోకుండా రక్షించిన ఇద్దరినీ డియర్ ఆఫీసర్స్ అని సంబోధిస్తూ ట్విట్టర్‌లో ఒక పోస్టు పెట్టారు. విప‌రీత‌మైన భావోద్వేగాలు మాన‌సిక సంక్షోభానికి దారి తీస్తాయ‌ని, దాని వ‌ల్ల గొడ‌వ‌లు జ‌రుగుతాయ‌ని, త‌ప్పుగా అర్థం చేసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని, ఇది ఎవ‌రికైనా హానిక‌ర‌మే అని డీజీపీ ఈ ఘ‌ట‌న‌పై త‌న ట్విట్ట‌ర్‌లో రాసుకొచ్చారు.

First Published:  25 April 2020 9:50 AM GMT
Next Story