Telugu Global
Cinema & Entertainment

ఓటీటీ నుంచి క్రిష్ కు భారీ ఆఫర్

ప్రస్తుతం కరోనా వైరస్ తో లాక్ డౌన్ వల్ల అందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఇంట్లోనే సినిమాలు చూస్తూ కాలం గడుపుతున్నారు. ఈ సమయంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కు డిమాండ్ పెరిగిపోయింది. అందరూ అందులో వెబ్ సిరీస్ లు, కొత్త సినిమాలు చూస్తున్నారు. ఈ లాక్ డౌన్ లో డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ కు భారీ డిమాండ్ నెలకొంది. ప్రస్తుతం దర్శకుడు క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘విరూపాక్ష’ […]

ఓటీటీ నుంచి క్రిష్ కు భారీ ఆఫర్
X

ప్రస్తుతం కరోనా వైరస్ తో లాక్ డౌన్ వల్ల అందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఇంట్లోనే సినిమాలు చూస్తూ కాలం గడుపుతున్నారు. ఈ సమయంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కు డిమాండ్ పెరిగిపోయింది. అందరూ అందులో వెబ్ సిరీస్ లు, కొత్త సినిమాలు చూస్తున్నారు. ఈ లాక్ డౌన్ లో డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ కు భారీ డిమాండ్ నెలకొంది.

ప్రస్తుతం దర్శకుడు క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘విరూపాక్ష’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇదే కాక.. తన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో తన నిర్మాణ భాగస్వామి రాజీవ్ రెడ్డితో కలిసి వివిధ వెబ్ సిరీస్ ను నిర్మించడంలో బిజీగా ఉన్నాడు.

తాజాగా దర్శకుడు క్రిష్ రాసి నిర్మించిన వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. అత్యంత ప్రజాదరణ పొందింది. దాదాపు 10 మిలియన్లకు పైగా జనాలు దీన్ని చూశారు. ఆహాలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ తో క్రిష్ టాలెంట్ వెలుగుచూసింది.

క్రిష్-రాజీవ్ రెడ్డిల ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ , సోనీ వంటి వివిధ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది. ఇప్పుడు టాప్ స్టార్స్ తోనూ వీరు వెబ్ సిరీస్ లను తీయడానికి రెడీ అయ్యారు. క్రిష్ టాలెంట్ తో ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ నుంచి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. అతడికి ఓటీటీలు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.

First Published:  26 April 2020 10:00 AM GMT
Next Story