Telugu Global
International

గుజరాత్‌ను వణికిస్తున్న 'ఎల్‌' స్ట్రెయిన్ కరోనా

కరోనా వైరస్‌ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఒక్కోచోట ఒక్కో తరహాలో కరోనా దాడి చేస్తోంది. ప్రాంతాలను బట్టి దాని ప్రభావం, దాడి విధానం మారుతుండడంతో వైద్యులకు సవాల్‌గా మారింది. గుజరాత్‌లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా ప్రస్తుతం గుజరాత్‌ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్రలో 8వేల 68 కేసులు నమోదయ్యాయి. రెండోస్థానంలో ఉన్న గుజరాత్‌లో కేసుల సంఖ్య 3వేల 71గా ఉంది. గుజరాత్‌లోని ఒక్క అహ్మదాబాద్‌లోనే 1,298 కేసులు నమోదు అయ్యాయి. […]

గుజరాత్‌ను వణికిస్తున్న ఎల్‌ స్ట్రెయిన్ కరోనా
X

కరోనా వైరస్‌ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఒక్కోచోట ఒక్కో తరహాలో కరోనా దాడి చేస్తోంది. ప్రాంతాలను బట్టి దాని ప్రభావం, దాడి విధానం మారుతుండడంతో వైద్యులకు సవాల్‌గా మారింది. గుజరాత్‌లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా ప్రస్తుతం గుజరాత్‌ దేశంలోనే రెండో స్థానంలో ఉంది.

మహారాష్ట్రలో 8వేల 68 కేసులు నమోదయ్యాయి. రెండోస్థానంలో ఉన్న గుజరాత్‌లో కేసుల సంఖ్య 3వేల 71గా ఉంది. గుజరాత్‌లోని ఒక్క అహ్మదాబాద్‌లోనే 1,298 కేసులు నమోదు అయ్యాయి. సూరత్‌లో 338, వడోదరలో 188 కేసులు నమోదు అయ్యాయి. గుజరాత్‌లో డెత్‌ రేటు పైనా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే 151 మంది గుజరాత్‌లో చనిపోయారు. చైనాలోని వూహాన్‌లో ప్రబలిన ‘ఎల్‌’ తరహా కరోనా వైరస్ స్ట్రెయినే గుజరాత్‌లోనూ దాడి చేస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘ఎస్‌’ తరహాతో పోలిస్తే ‘ఎల్‌’ తరహా స్ట్రెయిన్‌ చాలా ప్రమాదకరమైనదని వివరిస్తున్నారు.

ఇటీవల కరోనా వైరస్‌ ‘జినోమ్‌ సీక్వెన్సింగ్‌’ నిర్వహించినప్పుడు ‘ఎల్‌’ తరహా స్ట్రెయిన్‌ను గుర్తించామని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బయోటెక్నాలజీ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎల్‌ తరహా స్ట్రెయిన్‌ ఉన్న చోట మరణాలు ఎక్కువగా ఉంటాయని విదేశీ వైద్యులు కూడా నిర్ధారిస్తున్నట్టు వివరించారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కూడా ఇదే తరహా కరోనా వైరస్‌ దాడి చేస్తోంది. ఈ తరహా కరోనా వైరస్‌ దాడి ఉన్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

First Published:  26 April 2020 8:36 PM GMT
Next Story