Telugu Global
Cinema & Entertainment

పవన్ సినిమాకు 19 ఏళ్లు.. పండగ చేస్తున్న ఫ్యాన్స్

కెరీర్ స్టార్టింగ్ లో పవన్ కెరీర్ ను మలుపుతిప్పిన సినిమా తొలిప్రేమ. ఆ సినిమా తర్వాత పవన్ కు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా ఖుషి. ఇలా పవర్ స్టార్ కెరీర్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఖుషీ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 19 ఏళ్లు అవుతోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ అంతా మరోసారి అలెర్ట్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఖుషీ నాటి సంగతుల్ని పంచుకుంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. ఎస్ జే సూర్య దర్శకత్వంలో వచ్చిన […]

పవన్ సినిమాకు 19 ఏళ్లు.. పండగ చేస్తున్న ఫ్యాన్స్
X

కెరీర్ స్టార్టింగ్ లో పవన్ కెరీర్ ను మలుపుతిప్పిన సినిమా తొలిప్రేమ. ఆ సినిమా తర్వాత పవన్ కు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా ఖుషి. ఇలా పవర్ స్టార్ కెరీర్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఖుషీ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 19 ఏళ్లు అవుతోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ అంతా మరోసారి అలెర్ట్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఖుషీ నాటి సంగతుల్ని పంచుకుంటూ రచ్చరచ్చ చేస్తున్నారు.

ఎస్ జే సూర్య దర్శకత్వంలో వచ్చిన సినిమా ఖుషి. బలమైన స్టోరీలైన్ కు పవన్ మేనరిజమ్స్, ఎనర్జీ తోడవ్వడంతో సినిమా కల్ట్ ప్రేమకథగా నిలిచిపోయింది. ప్రేమలో పడిన ఇద్దరు వ్యక్తులు తమ ఇగో కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చివరికి ఎలా కలిశారనే పాయింట్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పాడు దర్శకుడు.

సినిమాలో పవన్ స్టయిల్, అతడి దుస్తులు-యాక్ససిరీస్, డైలాగ్స్, హెయిర్ స్టయిల్ కు మంచి పేరొచ్చింది. అప్పట్లో యూత్ అంతా ఈ స్టయిల్స్ ఫాలో అవ్వడానికి ఎగబడ్డారు. అటు భూమిక కూడా ఈ సినిమాతో స్టార్ అయిపోయింది. అప్పటికే చేతిలో ఓ హిట్ సినిమా ఉన్నప్పటికీ, ఆమెకు ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసింది మాత్రం ఖుషి సినిమానే.

First Published:  27 April 2020 9:47 AM GMT
Next Story