Telugu Global
Cinema & Entertainment

సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ తీస్తాడట

ఆర్ఎక్స్100… అజయ్ భూపతిని దర్శకుడిగా పరిచయం చేసిన సినిమా. కార్తికేయను హీరోగా పరిచయం చేసిన మూవీ. అటు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ను కూడా హీరోయిన్ గా పరిచయం చేసిన చిత్రం. ఈ ఒక్క సినిమాతో వీళ్లు ముగ్గురూ సక్సెస్ కొట్టారు. అలాంటి సూపర్ హిట్ సినిమాకు త్వరలోనే సీక్వెల్ తీస్తానని ప్రకటించాడు దర్శకుడు అజయ్ భూపతి. హీరో కార్తికేయతో కలిసి లైవ్ ఛాట్ చేశాడు దర్శకుడు అజయ్. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి నెటిజన్లు […]

సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ తీస్తాడట
X

ఆర్ఎక్స్100… అజయ్ భూపతిని దర్శకుడిగా పరిచయం చేసిన సినిమా. కార్తికేయను హీరోగా పరిచయం చేసిన మూవీ. అటు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ను కూడా హీరోయిన్ గా పరిచయం చేసిన చిత్రం. ఈ ఒక్క సినిమాతో వీళ్లు ముగ్గురూ సక్సెస్ కొట్టారు. అలాంటి సూపర్ హిట్ సినిమాకు త్వరలోనే సీక్వెల్ తీస్తానని ప్రకటించాడు దర్శకుడు అజయ్ భూపతి.

హీరో కార్తికేయతో కలిసి లైవ్ ఛాట్ చేశాడు దర్శకుడు అజయ్. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పారు. కార్తికేయతో మళ్లీ సినిమా ఎప్పుడు తీస్తున్నారంటూ ఒకరు ప్రశ్నించగా.. వెంటనే స్పందించిన అజయ్ భూపతి కార్తికేయతో సినిమా తీస్తే దానికి కచ్చితంగా ఆర్ఎక్స్100-2 అనే టైటిల్ పెడతానని ప్రకటించేశాడు.

నిజానికి కథాపరంగా ఆర్ఎక్స్100కు సీక్వెల్ తీయడం చాలా కష్టం. కానీ దాదాపు అలాంటి క్యారెక్టరైజేషన్ తో మరో సినిమా తీసి దానికి ఆర్ఎక్స్100-2 అనే పేరు పెడతానని దర్శకుడు ప్రకటించాడు. లైవ్ ఛాట్ సందర్భంగా హీరో-దర్శకుడు ఇద్దరూ అప్పటి షూటింగ్ అనుభవాల్ని మరోసారి పంచుకున్నారు.

First Published:  27 April 2020 11:17 AM GMT
Next Story