Telugu Global
NEWS

సూర్యాపేటలో కరోనా తగ్గుముఖం.... కంటైన్మెంట్ జోన్ల ఎత్తివేత

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లా తర్వాత అత్యధిక కరోనా పాజిటీవ్ కేసులతో రికార్డు సృష్టించిన సూర్యాపేటలో పరిస్థితులు క్రమంగా కుదుటపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా పాజిటీవ్ కేసులు నమోదు కాకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను ఎత్తివేశారు. జిల్లాలోని కుడకుడ, నేరేడు చర్ల, మఠంపల్లి ప్రాంతాల్లోని కంటైన్మెంట్ జోన్లను ఎత్తివేస్తూ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గత 24 రోజులుగా జిల్లాలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రతీ ఇంటికి […]

సూర్యాపేటలో కరోనా తగ్గుముఖం.... కంటైన్మెంట్ జోన్ల ఎత్తివేత
X

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లా తర్వాత అత్యధిక కరోనా పాజిటీవ్ కేసులతో రికార్డు సృష్టించిన సూర్యాపేటలో పరిస్థితులు క్రమంగా కుదుటపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా పాజిటీవ్ కేసులు నమోదు కాకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను ఎత్తివేశారు.

జిల్లాలోని కుడకుడ, నేరేడు చర్ల, మఠంపల్లి ప్రాంతాల్లోని కంటైన్మెంట్ జోన్లను ఎత్తివేస్తూ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గత 24 రోజులుగా జిల్లాలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రతీ ఇంటికి తిరిగిన వైద్య సిబ్బంది అందరికీ పరీక్షలు చేయగా ఒక్క కరోనా పాజిటీవ్ కేసు నమోదు కాలేదని ఆయన వెల్లడించారు.

కంటైన్మెంట్ జోన్లలో కొత్త కరోనా కేసులు నమోదు కాకపోయినా లాక్‌డౌన్ నిబంధనలు మాత్రం కొనసాగుతాయని కలెక్టర్ చెప్పారు. ప్రజలెవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని.. నిత్యావసరాలు,ఇతర వస్తువులను ఇండ్ల వద్దకే పంపిణీ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

మరోవైపు హైదరాబాద్‌లోని మోండా మార్కెట్ ప్రాంతంలో భౌతిక దూరం పాటించకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు పిర్యాదులు అందడంతో సోమవారం పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అక్కడ పర్యటించారు. లాక్‌డౌన్ అమలు తీరును ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు వ్యాపారులకు భౌతిక దూరం పాటించేలా హెచ్చరికలు జారీ చేశారు.

First Published:  27 April 2020 4:00 AM GMT
Next Story