Telugu Global
National

5వేల మంది రవాణాకు 3కోట్లు విడుదల చేసిన జగన్‌

గుజరాత్‌, ముంబైలో చిక్కుకుపోయిన మత్స్యకారులను స్వరాష్ట్రానికి రప్పించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా నెల రోజులకు పైగా మత్స్యకారులు గుజరాత్‌లో చిక్కుకుపోయారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన దాదాపు 5వేల మంది గుజరాత్, ముంబై ప్రాంతాల్లో ఉండిపోయారు. వారికి సరైన సదుపాయాలు కల్పించాలని ఇప్పటికే గుజరాత్‌ సీఎంతో జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడారు. అయితే ప్రస్తుతం పనులు లేకపోవడం, సరైన సదుపాయాలు లేకపోవడం, ఇతర ఇబ్బందులు ఎదురవుతుండడం, కుటుంబసభ్యుల వేధన నేపథ్యంలో వారంతా […]

5వేల మంది రవాణాకు 3కోట్లు విడుదల చేసిన జగన్‌
X

గుజరాత్‌, ముంబైలో చిక్కుకుపోయిన మత్స్యకారులను స్వరాష్ట్రానికి రప్పించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా నెల రోజులకు పైగా మత్స్యకారులు గుజరాత్‌లో చిక్కుకుపోయారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన దాదాపు 5వేల మంది గుజరాత్, ముంబై ప్రాంతాల్లో ఉండిపోయారు. వారికి సరైన సదుపాయాలు కల్పించాలని ఇప్పటికే గుజరాత్‌ సీఎంతో జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడారు. అయితే ప్రస్తుతం పనులు లేకపోవడం, సరైన సదుపాయాలు లేకపోవడం, ఇతర ఇబ్బందులు ఎదురవుతుండడం, కుటుంబసభ్యుల వేధన నేపథ్యంలో వారంతా తమను ఏపీకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

దాంతో జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో మాట్లాడారు. మత్స్యకారులను ఏపీకి తీసుకెళ్లేలా కేంద్రం నుంచి అనుమతి సాధించారు. వారందరిని తీసుకొచ్చేందుకు ప్రత్యేక వాహనాలను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.

ఇందుకోసం మూడు కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. సీఎం సహాయనిధి నుంచి ఈ సొమ్మును విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో గుజరాత్‌లో చిక్కుకుపోయిన మత్స్యకారులను ఏపీకి తీసుకొచ్చి కొద్దిరోజుల పాటు వారు ఇళ్లకే పరిమితమయ్యేలా చూడనున్నారు.

First Published:  27 April 2020 11:37 PM GMT
Next Story