Telugu Global
National

హెరిటేజ్ పాల ప్లాంట్‌లో కరోనా... ప్లాంట్‌ మూసివేతకు ఆందోళన

వారం రోజులు అధికారం అప్పగిస్తే ఏపీలో చంద్రబాబునాయుడు కరోనా లేకుండా చేస్తాడని టీడీపీ నేతలు దేవినేని ఉమా, కాలువ శ్రీనివాస్ ఒకవైపు చెబుతుంటే… చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ సంస్థలో కరోనా కలకలం రేగింది. హైదరాబాద్‌లో ఉప్పల్‌లోని హెరిటేజ్ పాలకేంద్రంలో కరోనా బయటపడింది. ప్లాంట్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుకు కరోనా సోకింది. దాంతో అతడిని వైద్యం కోసం తరలించారు. మిగిలిన ఏడుగురు సెక్యూరిటీ గార్డుల చేతులకు అధికారులు స్టాంప్‌లు వేశారు. ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 34 మందికి […]

హెరిటేజ్ పాల ప్లాంట్‌లో కరోనా... ప్లాంట్‌ మూసివేతకు ఆందోళన
X

వారం రోజులు అధికారం అప్పగిస్తే ఏపీలో చంద్రబాబునాయుడు కరోనా లేకుండా చేస్తాడని టీడీపీ నేతలు దేవినేని ఉమా, కాలువ శ్రీనివాస్ ఒకవైపు చెబుతుంటే… చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ సంస్థలో కరోనా కలకలం రేగింది. హైదరాబాద్‌లో ఉప్పల్‌లోని హెరిటేజ్ పాలకేంద్రంలో కరోనా బయటపడింది.

ప్లాంట్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుకు కరోనా సోకింది. దాంతో అతడిని వైద్యం కోసం తరలించారు. మిగిలిన ఏడుగురు సెక్యూరిటీ గార్డుల చేతులకు అధికారులు స్టాంప్‌లు వేశారు. ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 34 మందికి స్టాంప్ వేశారు. వారందరినీ హోం క్వారంటైన్‌ నుంచి బయటకు రావొద్దని సూచించారు. అయినా సరే సెక్యూరిటీ గార్డులు యదేచ్చగా తిరుగుతున్నారు. దీన్ని గమనించిన స్థానికులు ఆందోళనకు దిగారు.

కరోనా బయటపడినందున ఉప్పల్‌లో హెరిటేజ్ పాల ప్లాంట్‌ను మూసివేయాలంటూ హెరిటేజ్ ఉన్నత ఉద్యోగులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. అందుకు వారు అంగీకరించలేదు. పాలు అత్యవసరం అని, ప్లాంట్‌ నడిపేందుకు అనుమతి ఉందని వాదించారు.

హెరిటేజ్ ప్లాంట్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుకు కరోనా నిజమేనని వైద్యులు నిర్ధారించారు. అయితే ప్లాంట్‌ను మూసివేయాలా? వద్దా? అన్నది అధికారులు నిర్ణయించాల్సి ఉందని చెప్పారు.

First Published:  28 April 2020 8:29 AM GMT
Next Story