Telugu Global
Cinema & Entertainment

లాక్ డౌన్ టైమ్ లో కాజల్ ఏం చేస్తోంది?

హీరోయిన్లంతా ఈ లాక్ డౌన్ టైమ్ లో ఎవరికి నచ్చిన పని వాళ్లు చేసుకుంటున్నారు. తినడం, పడుకోవడం, టీవీ చూడడం లాంటివి మాత్రం కామన్. ఎక్కువ టైమ్ ఖాళీగానే గడిచిపోతోంది. అయితే కాజల్ మాత్రం ఈ క్వారంటైన్ టైమ్ ను సద్వినియోగం చేసుకుంటోంది. తనకు మళ్లీ ఇంత ఖాళీ టైమ్ దొరకదని, అందుకే ఇన్నాళ్లూ మనసులో అనుకున్న పనుల్ని ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నట్టు ప్రకటించింది. సద్గురు చెప్పిన శాంభవి మహాముద్ర అనే ఆసనాన్ని ప్రయత్నిస్తోంది కాజల్. ఇది […]

లాక్ డౌన్ టైమ్ లో కాజల్ ఏం చేస్తోంది?
X

హీరోయిన్లంతా ఈ లాక్ డౌన్ టైమ్ లో ఎవరికి నచ్చిన పని వాళ్లు చేసుకుంటున్నారు. తినడం, పడుకోవడం, టీవీ చూడడం లాంటివి మాత్రం కామన్. ఎక్కువ టైమ్ ఖాళీగానే గడిచిపోతోంది. అయితే కాజల్ మాత్రం ఈ క్వారంటైన్ టైమ్ ను సద్వినియోగం చేసుకుంటోంది. తనకు మళ్లీ ఇంత ఖాళీ టైమ్ దొరకదని, అందుకే ఇన్నాళ్లూ మనసులో అనుకున్న పనుల్ని ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నట్టు ప్రకటించింది.

సద్గురు చెప్పిన శాంభవి మహాముద్ర అనే ఆసనాన్ని ప్రయత్నిస్తోంది కాజల్. ఇది చేయడానికి దాదాపు 45 నిమిషాల టైమ్ పడుతుంది. దీంతోపాటు భగవద్గీత చదవి అర్థం చేసుకోవాలనేది తన కోరికని, ఇన్నాళ్లకు ఆ కోరికను అమల్లోకి పెట్టినట్టు తెలిపింది.

కేవలం ఇవి మాత్రమే కాదు.. సైన్స్ పరంగా కూడా క్వాంటమ్ మెకానిక్స్, న్యూరో ఫిజిక్స్ గురించి తెలుసుకోవాలనే ఆశ తనకు ఎప్పట్నుంచో ఉందని.. అందుకే ఆన్ లైన్లో ఆ కోర్సులు కూడా నేర్చుకుంటున్నట్టు స్పష్టంచేసింది. అటు చెస్ గేమ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలిపింది.

ఇలా ఎప్పట్నుంచో చేయాలనుకుంటున్న పనుల్ని ఒక్కసారిగా అమల్లోకి తీసుకొచ్చింది ఈ చందమామ. ఎప్పట్నుంచో చేయాలనుకొని చేయలేకపోయిన ఈ పనుల్ని ఒక్కసారిగా అమల్లోకి పెట్టేసరికి మనసుకు చాలా హాయిగా ఉందంటోంది.

First Published:  27 April 2020 7:02 PM GMT
Next Story