లాక్‌డౌన్‌లో పోలీసుల భయం…. బర్త్‌ డే రోజే విషాదం

కరీంనగర్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జమ్మికుంట మండలం కొత్తపల్లికి చెందిన రాజగోపాల్‌ తన బర్త్‌ డే ను సెలబ్రెట్‌ చేసుకోవాలని అనుకున్నాడు. లాక్‌డౌన్‌ కావడంతో స్నేహితులను పిలిచి ఊరి బయట పుట్టినరోజు వేడుక ఏర్పాటు చేశాడు.

పార్టీకి మందు దొరక్కపోవడంతో కల్లుతో అరెంజ్‌ చేశాడు. తమ పక్క మండలం ఇల్లంతకుంటలోని మల్యాల గ్రామం తాటివనంలో పార్టీ ఇస్తానని ఫ్రెండ్స్‌ను రమ్మన్నాడు. అక్కడ అందరూ పార్టీ చేసుకునేందుకు రెడీ అయ్యారు. కేక్‌ కట్‌ చేసి కల్లు తాగుతున్న సమయంలో ఎవరో పోలీసులు వస్తున్నారని సమాచారం ఇచ్చారు. దీంతో అందరూ తలో దిక్కు పరుగులు పెట్టారు.

ఇటు రాజగోపాల్‌ కూడా పరిగెడుతూ ప్రమాదవశాత్తూ బావిలో పడి చనిపోయాడు. బర్త్‌ డే రోజే బావిలో పడి చనిపోవడంతో స్నేహితులు కన్నీరుమున్నీరు అయ్యారు.