Telugu Global
Cinema & Entertainment

ఓటీటీలోకి తొలి స్ట్రయిట్ మూవీ వచ్చేసింది

లాక్ డౌన్ తో థియేటర్లన్నీ మూతపడ్డంతో ఓటీటీకి డిమాండ్ పెరిగింది. థియేట్రికల్ రిలీజ్ తో సంబంధం లేకుండా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కు తమ సినిమాలను ఇచ్చేందుకు చాలామంది నిర్మాతలు పావులు కదిపారు. కానీ పెద్ద సినిమాల విషయంలో ఆ దిశగా పురోగతి కనబరచలేదు. ఓవైపు ఇలా చర్చలు జరుగుతుండగానే ఓ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. దాని పేరు అమృతరామమ్. లెక్కప్రకారం ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25న […]

ఓటీటీలోకి తొలి స్ట్రయిట్ మూవీ వచ్చేసింది
X

లాక్ డౌన్ తో థియేటర్లన్నీ మూతపడ్డంతో ఓటీటీకి డిమాండ్ పెరిగింది. థియేట్రికల్ రిలీజ్ తో సంబంధం లేకుండా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కు తమ సినిమాలను ఇచ్చేందుకు చాలామంది నిర్మాతలు పావులు కదిపారు. కానీ పెద్ద సినిమాల విషయంలో ఆ దిశగా పురోగతి కనబరచలేదు. ఓవైపు ఇలా చర్చలు జరుగుతుండగానే ఓ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. దాని పేరు అమృతరామమ్.

లెక్కప్రకారం ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25న రిలీజ్ చేయాలనుకున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో ఒప్పందం కూడా జరిగిపోయింది. సరిగ్గా అదే సమయానికి లాక్ డౌన్ పడింది. దీంతో థియేట్రికల్ రిలీజ్ తో సంబంధం లేకుండా జీ5 యాప్ కు అన్ని హక్కులు కట్టబెట్టేశారు. అలా థియేటర్లలో రిలీజ్ అవ్వకుండా, ఓటీటీలోకి వచ్చిన తొలి స్ట్రయిట్ తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది అమృతరామమ్.

ఇవాళ్టి నుంచి ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ కు పెట్టారు. ఇప్పటికే చాలామంది సినిమా చూశారు. పరమ చెత్తగా ఉందనే కామెంట్స్ కూడా పడుతున్నాయి. ఆస్ట్రేలియా వెళ్లిన ఓ అమ్మాయి, అక్కడ ఓ అబ్బాయిని చూసి పిచ్చిపిచ్చిగా ప్రేమలో పడిపోతుంది. ఆ తర్వాత జరిగే ఘటనలతో ఈ సినిమా నడుస్తుంది. సినిమాలో ఎక్కడా కొత్తదనం లేదని, థియేటర్లలో రిలీజ్ అవ్వకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చి డబ్బులు మిగిల్చిందంటూ ఈ మూవీపై ఆల్రెడీ సెటైర్లు కూడా పడుతున్నాయి.

First Published:  29 April 2020 5:04 AM GMT
Next Story