Telugu Global
National

ఏపీలో లాక్‌డౌన్ నుంచి అదనపు మినహాయింపులు

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నుంచి మరి కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో ఏపీ సర్కార్ కూడా సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తుండటంతో మార్చి 25 నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం నడుస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా కొన్ని మినహాయింపులు ప్రకటించింది. ఏప్రిల్ 27న ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కొంత మంది సీఎంలు పలు మినహాయింపులు కోరారు. రాష్ట్రాల ఆర్థిక స్థితి […]

ఏపీలో లాక్‌డౌన్ నుంచి అదనపు మినహాయింపులు
X

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నుంచి మరి కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో ఏపీ సర్కార్ కూడా సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తుండటంతో మార్చి 25 నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం నడుస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా కొన్ని మినహాయింపులు ప్రకటించింది.

ఏప్రిల్ 27న ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కొంత మంది సీఎంలు పలు మినహాయింపులు కోరారు. రాష్ట్రాల ఆర్థిక స్థితి బలహీన పడుతుండటంతో ఆయా రంగాలకు సడలింపులు కోరారు. దీని ప్రకారం వ్యవసాయ రంగం, ఉద్యానవన పంటలకు ఇప్పటికే మినహాయింపులు ఇచ్చారు.

తాజాగా ప్లాంటేషన్ పనులు, కోతలు, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్ పనులకు మినహాయింపులు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులు, విద్యుత్ లైన్లు, టెలికాం కేబులింగ్ పనులకు కూడా అనుమతులు ఇచ్చారు.

మరోవైపు ఏపీలో ఈ-కామర్స్ కంపెనీల వాహనాలు తిరగడానికి వీలుగా సడలింపులు ఇచ్చారు. కరోనా లక్షణాలు లేని వలస కార్మికులు తమ సొంత ఊరిలో పని చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఎలక్ట్రిక్ దుకాణాలు, స్టేషనరీ షాపులు తెరవడానికి కూడా ప్రభుత్వం ఒప్పుకుంది. అర్బన్ ప్రాంతాల్లో ఉండే మల్టీ బ్రాండ్, సింగిల్ బ్రాండ్ మాల్స్ తెరవడానికి నిరాకరించారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే దుకాణాలు, కాంప్లెక్స్‌లు తెరవడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

కాగా, ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చిన సంస్థలు, వ్యాపారులు తప్పకుండా కొన్ని నిబంధనలు పాటించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు, కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించాలని, వ్యాపార ప్రాంతాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, మాస్కులు తప్పని సరిగా ధరించాలని ఆదేశించారు. లేకపోతే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం పేర్కొంది.

First Published:  29 April 2020 8:19 AM GMT
Next Story