Telugu Global
NEWS

కరోనా కాలంలోనూ ఆగని సంక్షేమ పథం

ప్రపంచం మొత్తం కరోనా మాటే విన్పిస్తోంది. పలు దేశాలు అల్లాడుతున్నాయి. కరోనా కట్టడి చుట్టూ అందరూ తిరుగుతున్నారు. అయితే ఒకవైపు కరోనాకు చెక్‌ పెట్టేందుకు చర్యలు చేపడుతూనే….సంక్షేమ బాటను మాత్రం ఏపీ సీఎం జగన్‌ వీడలేదు. కరోనాపై యుద్ధం ఓ వైపు సాగుతోంది. అధికారులు, కీలక మంత్రులు కరోనా కట్టడిపై దృష్టిపెట్టారు. సీఎం జగన్‌ కూడా ప్రతిరోజూ సమీక్ష నిర్వహిస్తున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు ఇస్తున్నారు. దేశంలోనే కరోనా టెస్టులు ఎక్కువ నిర్వహిస్తున్న రాష్ట్రం ఏపీ. కొరియా […]

కరోనా కాలంలోనూ ఆగని సంక్షేమ పథం
X

ప్రపంచం మొత్తం కరోనా మాటే విన్పిస్తోంది. పలు దేశాలు అల్లాడుతున్నాయి. కరోనా కట్టడి చుట్టూ అందరూ తిరుగుతున్నారు.

అయితే ఒకవైపు కరోనాకు చెక్‌ పెట్టేందుకు చర్యలు చేపడుతూనే….సంక్షేమ బాటను మాత్రం ఏపీ సీఎం జగన్‌ వీడలేదు. కరోనాపై యుద్ధం ఓ వైపు సాగుతోంది. అధికారులు, కీలక మంత్రులు కరోనా కట్టడిపై దృష్టిపెట్టారు. సీఎం జగన్‌ కూడా ప్రతిరోజూ సమీక్ష నిర్వహిస్తున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు ఇస్తున్నారు.

దేశంలోనే కరోనా టెస్టులు ఎక్కువ నిర్వహిస్తున్న రాష్ట్రం ఏపీ. కొరియా నుంచి కిట్స్‌ తెప్పించి భారీ ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలో కేసులు బయటపడుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఏ రాష్ట్రంలో లేని విధంగా టెస్టులు నిర్వహించడమే. మరోవైపు కరోనా ఐసోలేషన్‌ వార్డుల్లో ఉన్నవారికి పోషకాహారం అందిస్తున్నారు. వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత ఖర్చులకు రెండు వేల రూపాయలు అందిస్తున్నారు.

గత ప్రభుత్వంలో లాగా అర్ధరాత్రి వరకు సమీక్షలు లేవు… ఆర్టీజీఎస్‌ ఫొటోలు లేవు… గంటల కొద్దీ మీటింగ్‌లు లేవు… కరోనా టూర్ల పేరిట హడావుడి లేదు… డ్యాష్‌ బోర్డు లెక్కలు లేవు… అంతా పక్కాగా… ప్లానింగ్‌తో ఏపీలో కరోనాపై యుద్ధం సాగుతోంది. సీఎం డైరెక్షన్‌ లో అధికారులు టెన్షన్‌ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అడ్మినిస్ట్రేషన్‌ సాఫీగా సాగుతోంది.

గతంలో సీఎం పర్యటన కోసం అధికారులు హడావుడి పడేవారు. ఆ టూర్‌పైనే అందరూ ఫోకస్‌ పెట్టేవారు. దీంతో క్షేత్రస్థాయిలో సమస్యలు అలాగే ఉండేవి. అధికారులు చర్యలు తీసుకోవడానికి కూడా టైమ్‌ ఉండేది కాదు. కానీ ఇప్పుడు టెన్షన్‌ లేకుండా అధికారులు చర్యలు ప్రారంభించారు. దీంతో జిల్లాల్లో ఎక్కడికక్కడ నిర్ణయాలు జరిగిపోతున్నాయి.

కరోనా టైమ్ లో పేదలకు ఉచిత రేషన్ సరఫరా చేస్తున్నారు. తెల్ల రేషన్‌ కార్డు దారులకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం కూడా అందేలా చేశారు. ఆతర్వాత వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని కూడా ప్రారంభించారు. డ్వాక్రా మహిళల అకౌంట్లలో డబ్బులు వేశారు. ఇప్పుడు జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించారు. కరోనాకు ముందే వసతి దీవెన పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి, ఇప్పుడు విద్యాదీవెన పథకాన్ని ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల్ని కాలేజీలకు చెల్లించడంతో పాటు.. విద్యార్థులకు పూర్తి ఫీజును రీఇంబర్స్ మెంట్ చేయబోతున్నారు.

వైఎస్‌ఆర్‌ జయంతి రోజున జులైలో ఏకంగా 27 లక్షల ఇళ్ల పట్టాలు కూడా అందజేయబోతున్నారు. ఓవైపు కరోనాతో పలు రాష్ట్రాలు…. పాలనలో కష్టంగా ముందుకుసాగుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో కరోనాపై పుల్‌ ఫోకస్‌ పెడుతూనే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏపీ సీఎం జగన్. తాను నమ్మిన సంక్షేమ పథాన్ని మాత్రం వీడడం లేదు.

First Published:  28 April 2020 8:46 PM GMT
Next Story