Telugu Global
Cinema & Entertainment

బాలయ్య సినిమాలో నేను లేను

దాదాపు 2 రోజులుగా బాలయ్య-బోయపాటి సినిమాకు సంబంధించి చిన్నపాటి పుకారు నడిచింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ హీరో నవీన్ పొలిశెట్టిని తీసుకున్నారంటూ ప్రచారం జరిగింది. దీన్ని చాలామంది నిజం అనుకున్నారు కూడా. ఎందుకంటే తన సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకు కూడా పెద్ద పెద్ద నటుల్ని తీసుకోవడం బోయపాటికి అలవాటు. గతంలో వచ్చిన లెజెండ్, వినయ విధేయ రామ, జయజానకినాయక సినిమాలు చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. కాబట్టి […]

బాలయ్య సినిమాలో నేను లేను
X

దాదాపు 2 రోజులుగా బాలయ్య-బోయపాటి సినిమాకు సంబంధించి చిన్నపాటి పుకారు నడిచింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ హీరో నవీన్ పొలిశెట్టిని తీసుకున్నారంటూ ప్రచారం జరిగింది. దీన్ని చాలామంది నిజం అనుకున్నారు కూడా. ఎందుకంటే తన సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకు కూడా పెద్ద పెద్ద నటుల్ని తీసుకోవడం బోయపాటికి అలవాటు.

గతంలో వచ్చిన లెజెండ్, వినయ విధేయ రామ, జయజానకినాయక సినిమాలు చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. కాబట్టి కొత్త సినిమాలో కూడా ఓ పాత్ర కోసం నవీన్ ను తీసుకునే అంటాడని అంతా అనుకున్నారు. అయితే అలాంటిదేం లేదని స్వయంగా నవీన్ పొలిశెట్టి క్లారిటీ ఇచ్చాడు.

ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో టాలీవుడ్ లో పాపులర్ అయిన ఈ నటుడు.. బోయపాటి-బాలయ్య సినిమాలో తను నటిస్తున్నాననే వార్తలో ఎలాంటి నిజం లేదని స్పష్టంచేశాడు. అంతేకాదు.. కనీసం తనను ఎవ్వరూ సంప్రదించలేదని కూడా అంటున్నాడు ఈ నటుడు. ఇతడి ప్రకటనతో మొన్నటివరకు వచ్చిన పుకార్లకు ఫుల్ స్టాప్ పడినట్టయింది.

ప్రస్తుతం నవీన్ చేతిలో జాతిరత్నాలు అనే సినిమా మాత్రమే ఉంది. స్వప్న సినిమాస్ బ్యానర్ పై వస్తున్న ఈ మూవీలో నవీన్ హీరోగా నటిస్తున్నాడు. సినిమా షూటింగ్ కూడా ముగిసింది. ఇప్పటివరకు నవీన్ తన నెక్ట్స్ మూవీ డీటెయిల్స్ బయటపెట్టలేదు.

First Published:  29 April 2020 6:00 AM GMT
Next Story