Telugu Global
Cinema & Entertainment

రంగస్థలం తర్వాత సుకుమార్ సినిమా అదే!

రంగస్థలం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు సుకుమార్. ఎట్టకేలకు పుష్ప సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ రెండేళ్ల గ్యాప్ లో సుకుమార్ ఏం చేశాడు.. కేవలం పుష్ప సినిమా కోసమే వర్క్ చేశాడా? దీనిపై చిన్నపాటి క్లారిటీ ఇచ్చాడు సుక్కూ. రంగస్థలం సినిమా తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం మీద సినిమా చేయాలనుకున్నాడట సుకుమార్. ఆ మేరకు తెలంగాణ పోరాటానికి సంబంధించిన పుస్తకాలన్నీ తెప్పించుకొని చదివాడు. అంతేకాదు.. ఓ స్టోరీలైన్ కూడా రాసుకున్నాడు. […]

రంగస్థలం తర్వాత సుకుమార్ సినిమా అదే!
X

రంగస్థలం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు సుకుమార్. ఎట్టకేలకు పుష్ప సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ రెండేళ్ల గ్యాప్ లో సుకుమార్ ఏం చేశాడు.. కేవలం పుష్ప సినిమా కోసమే వర్క్ చేశాడా? దీనిపై చిన్నపాటి క్లారిటీ ఇచ్చాడు సుక్కూ.

రంగస్థలం సినిమా తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం మీద సినిమా చేయాలనుకున్నాడట సుకుమార్. ఆ మేరకు తెలంగాణ పోరాటానికి సంబంధించిన పుస్తకాలన్నీ తెప్పించుకొని చదివాడు. అంతేకాదు.. ఓ స్టోరీలైన్ కూడా రాసుకున్నాడు. అలా 6 నెలలు కష్టపడిన తర్వాత, ఎందుకో ఆ సబ్జెక్ట్ ను పక్కనపెట్టేశాడు సుకుమార్.

ఆ తర్వాత ఫ్రెష్ గా పుష్ప కథ రాసుకున్నాడు. దాన్ని తీసుకెళ్లి మహేష్ కు చెప్పాడు. ఇక అక్కడ్నుంచి జరిగిన కథ అందరికీ తెలిసిందే. ఆఖరి నిమిషంలో మహేష్ ఆ కథను రిజెక్ట్ చేయడం, వెంటనే బన్నీతో సుకుమార్ ఆ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేయడం చకచకా జరిగిపోయాయి. లాక్ డౌన్ పూర్తయి, షూటింగ్స్ కు అనుమతి ఇచ్చిన వెంటనే పుష్ప కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

First Published:  29 April 2020 7:00 AM GMT
Next Story