Telugu Global
Cinema & Entertainment

రామ్ అరుదైన రికార్డ్

ఎన్నో రికార్డులుంటాయి. కొన్నింటిని కష్టపడి సాధిస్తాం. మరికొన్ని రికార్డులు అనుకోకుండా అలా పుడతాయి. అలాంటి ఊహించని రికార్డునే సొంతం చేసుకున్నాడు హీరో రామ్. ఇతడు నటించిన సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లు, రామ్ కు ఈ ఘనతను సాధించి పెట్టాయి. యూట్యూబ్ లో వంద మిలియన్ వ్యూస్ సాధించిన 4 సినిమాల హీరోగా రామ్ ఈ రికార్డ్ అందుకున్నాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. తాజాగా ఈ సినిమాకు యూట్యూబ్ లో […]

రామ్ అరుదైన రికార్డ్
X

ఎన్నో రికార్డులుంటాయి. కొన్నింటిని కష్టపడి సాధిస్తాం. మరికొన్ని రికార్డులు అనుకోకుండా అలా పుడతాయి. అలాంటి ఊహించని రికార్డునే సొంతం చేసుకున్నాడు హీరో రామ్. ఇతడు నటించిన సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లు, రామ్ కు ఈ ఘనతను సాధించి పెట్టాయి. యూట్యూబ్ లో వంద మిలియన్ వ్యూస్ సాధించిన 4 సినిమాల హీరోగా రామ్ ఈ రికార్డ్ అందుకున్నాడు.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. తాజాగా ఈ సినిమాకు యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఫిబ్రవరి 16న యూట్యూబ్ లో దీన్ని అప్ లోడ్ చేయగా.. 45 రోజుల్లో ఈ ఘనత సాధించింది ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాతో వరుసగా 4వసారి వంద మిలియన్ వ్యూస్ సాధించిన హీరోగా నిలిచాడు రామ్.

ఇంతకుముందు రామ్ నటించిన ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే, నేను శైలజ సినిమాలు యూట్యూబ్ లో వంద మిలియన్ వ్యూస్ సాధించింది. ఇస్మార్ట్ శంకర్ నాలుగో సినిమా. ఇలా బ్యాక్ టుబ్యాక్ యూట్యూబ్ లో వంద మిలియన్ వ్యూస్ సాధించిన హీరో.. సౌత్ మొత్తమ్మీద రామ్ ఒక్కడే.

First Published:  30 April 2020 6:00 AM GMT
Next Story