Telugu Global
Cinema & Entertainment

పవన్ కల్యాణ్... ఓ వజ్రాల దొంగ

పవన్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ గురించి అందరికీ తెలిసిందే. ఇదొక రీమేక్. హిందీ, తమిళ్ లో ఆల్రెడీ హిట్టయిన సినిమా. కాబట్టి వకీల్ సాబ్ స్టోరీలైన్ పై ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తి లేదు. ఎటొచ్చి పవన్ రీఎంట్రీ మూవీ కాబట్టి, అతడి లుక్ పై మాత్రమే ఫ్యాన్స్ కు ఇంట్రెస్ట్. కానీ క్రిష్ మూవీ అలా కాదు. ఇందులో చాలా విశేషాలు ఉన్నాయి. మొఘలుల కాలం నాటి కథతో తెరకెక్కుతోంది క్రిష్ మూవీ. ఈ సినిమాలో […]

పవన్ కల్యాణ్... ఓ వజ్రాల దొంగ
X

పవన్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ గురించి అందరికీ తెలిసిందే. ఇదొక రీమేక్. హిందీ, తమిళ్ లో ఆల్రెడీ హిట్టయిన సినిమా. కాబట్టి వకీల్ సాబ్ స్టోరీలైన్ పై ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తి లేదు. ఎటొచ్చి పవన్ రీఎంట్రీ మూవీ కాబట్టి, అతడి లుక్ పై మాత్రమే ఫ్యాన్స్ కు ఇంట్రెస్ట్. కానీ క్రిష్ మూవీ అలా కాదు. ఇందులో చాలా విశేషాలు ఉన్నాయి.

మొఘలుల కాలం నాటి కథతో తెరకెక్కుతోంది క్రిష్ మూవీ. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఓ దొంగగా కనిపించబోతున్నాడు. దీనికితోడు మరో ఇంట్రెస్టింగ్ మేటర్ కూడా తాజాగా బయటకొచ్చింది. ఈ సినిమా మొత్తం ఓ ఖరీదైన వజ్రం చుట్టూ తిరుగుతుందట. ఆ వజ్రాన్ని పవన్ ఎలా దొంగిలించాడనే కాన్సెప్ట్ ను సినిమాలో చూపించబోతున్నారట.

నిజానికి ఈ టైపు కథలు ఇండియన్ సినిమాకు కొత్తకాదు. తెలుగులో కూడా గతంలో ఇలాంటి ట్రెజర్ హంట్ సినిమాలు చాలానే వచ్చాయి. అయితే పవన్ తో చేస్తున్న సినిమా మాత్రం ట్రీట్ మెంట్ చాలా కొత్తగా ఉంటుందంటున్నాడు దర్శకుడు క్రిష్. ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ అనుకుంటున్నారు.

First Published:  30 April 2020 4:01 AM GMT
Next Story