Telugu Global
Cinema & Entertainment

ఈ ఏడాది నాగ్ నుంచి ఒకే సినిమా

ఇన్నేళ్ల కెరీర్ లో నాగార్జున గ్యాప్స్ ఇచ్చిన దాఖలాలు చాలా తక్కువ. అప్పుడెప్పుడో ఆటోడ్రైవర్ లాంటి డిజాస్టర్ వచ్చినప్పుడు, ఆకాశవీధిలో లాంటి అట్టర్ ఫ్లాప్ వచ్చినప్పుడు, ఆఫీసర్ లాంటి డబుల్ డిజాస్టర్ వచ్చినప్పుడు మాత్రమే చిన్న చిన్న గ్యాప్స్ తీసుకున్నాడు. అలాంటి హీరో ఇప్పుడు మరోసారి గ్యాప్ తీసుకున్నాడు. ఇందులో రెండు రకాలున్నాయి. ఒకటి నాగార్జున కావాలని తీసుకున్న గ్యాప్ కాగా, రెండోది లాక్ డౌన్ వల్ల వచ్చిన గ్యాప్. ఏదైతేనేం నాగార్జున నుంచి మరో సినిమా […]

ఈ ఏడాది నాగ్ నుంచి ఒకే సినిమా
X

ఇన్నేళ్ల కెరీర్ లో నాగార్జున గ్యాప్స్ ఇచ్చిన దాఖలాలు చాలా తక్కువ. అప్పుడెప్పుడో ఆటోడ్రైవర్ లాంటి డిజాస్టర్ వచ్చినప్పుడు, ఆకాశవీధిలో లాంటి అట్టర్ ఫ్లాప్ వచ్చినప్పుడు, ఆఫీసర్ లాంటి డబుల్ డిజాస్టర్ వచ్చినప్పుడు మాత్రమే చిన్న చిన్న గ్యాప్స్ తీసుకున్నాడు.

అలాంటి హీరో ఇప్పుడు మరోసారి గ్యాప్ తీసుకున్నాడు. ఇందులో రెండు రకాలున్నాయి. ఒకటి నాగార్జున కావాలని తీసుకున్న గ్యాప్ కాగా, రెండోది లాక్ డౌన్ వల్ల వచ్చిన గ్యాప్. ఏదైతేనేం నాగార్జున నుంచి మరో సినిమా రావడం మాత్రం చాలా ఆలస్యం అవుతోంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది నాగార్జున నుంచి కేవలం ఒకే ఒక్క సినిమా మాత్రమే రాబోతోంది.

మన్మథుడు-2 డిజాస్టర్ అయిన తర్వాత నాగార్జున పూర్తిగా డల్ అయిపోయాడు. ఎందుకంటే ఆ సినిమా తన కెరీర్ లో క్లాసిక్ గా నిలిచిపోతుందని భావించాడు నాగ్. కానీ సినిమా యావరేజ్ గా కూడా ఆడకపోయేసరికి బాగా నిరాశచెందాడు. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. అలా చాన్నాళ్లు గ్యాప్ తీసుకున్న తర్వాత ఎట్టకేలకు సాల్మన్ డైరక్షన్ లో వైల్డ్ డాగ్ అనే సినిమా స్టార్ట్ చేశాడు.

ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎలాంటి ఆర్భాటం చేయలేదు నాగ్. షూటింగ్ సగం పూర్తయిన తర్వాత మాత్రమే సినిమాను ఎనౌన్స్ చేసి, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశాడు. అలా సైలెంట్ గా షూట్ చేసి, అంచనాలు పెంచకుండా మూవీని రిలీజ్ చేద్దాం అనుకున్నాడు. కానీ లాక్ డౌన్ పడింది.

దీంతో వైల్డ్ డాగ్ సినిమా ఆగిపోయింది. మరోవైపు కల్యాణ కృష్ణ దర్శకత్వంలో చేయాల్సిన బంగార్రాజు ప్రాజెక్టు ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా కనిపించడం లేదు. వచ్చినా ఈ ఏడాది రిలీజ్ అవ్వడం కష్టమే. సో.. ఈ ఏడాది నాగ్ నుంచి వస్తే ఒకే ఒక్క సినిమా వస్తుంది. అది కూడా వైల్డ్ డాగ్ మాత్రమే.

First Published:  29 April 2020 8:01 PM GMT
Next Story