Telugu Global
Cinema & Entertainment

ఫ్లాపులపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది రాశిఖన్నా. తనపై ఏ చిన్న దుమారం చెలరేగినా వెంటనే క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో తనపై 2 రోజులుగా నడుస్తున్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది ఈ బ్యూటీ. ఇంతకీ మేటర్ ఏంటంటే.. విజయ్ దేవరకొండ, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా పెద్ద డిజాస్టర్. పైగా ఇందులో కాస్త బోల్డ్ గా నటించింది రాశిఖన్నా. దీంతో ఇలాంటి […]

ఫ్లాపులపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
X

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది రాశిఖన్నా. తనపై ఏ చిన్న దుమారం చెలరేగినా వెంటనే క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో తనపై 2 రోజులుగా నడుస్తున్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది ఈ బ్యూటీ.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. విజయ్ దేవరకొండ, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా పెద్ద డిజాస్టర్. పైగా ఇందులో కాస్త బోల్డ్ గా నటించింది రాశిఖన్నా. దీంతో ఇలాంటి సినిమాల్లో నటించొద్దంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్నారు.

వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్ కు రాశిఖన్నాకు సంబంధం లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు రాశిఖన్నా ఫ్యాన్స్. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులకు ఆగ్రహం వచ్చింది. ఇలా 2 రోజులుగా నడుస్తున్న వివాదం పెద్దది కావడంతో రాశిఖన్నా క్లారిటీ ఇచ్చింది.

సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా అందులో తనకు కూడా భాగం ఉంటుందని స్పష్టంచేసింది రాశిఖన్నా. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రతి సినిమా రిజల్ట్ కు తను కూడా బాధ్యత తీసుకుంటానని తెలిపింది. ఇలా వరల్డ్ ఫేమస్ లవర్ పై, తనపై వస్తున్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

First Published:  30 April 2020 2:37 AM GMT
Next Story